టీమిండియాతో పోరుకి సిద్దమైన సఫారీలు

-

మార్చి 12 నుంచి టీమిండియాతో జరిగే మూడు వన్డేల సిరీస్ కోసం దక్షిణాఫ్రికా జట్టు భారత్‌కు చేరుకుంది. 16 మంది టీం సభ్యులతో ఆఫ్రికన్ జట్టు నేడు ధర్మశాలకు బయలుదేరింది. భారత జట్టు కూడా మంగళవారం ధర్మశాల చేరుకోనుంది. బెంగళూరులోని జాతీయ క్రికెట్ అకాడమీలో భారత ఆటగాళ్ళు ఫిట్‌నెస్ టెస్టు ఇవ్వనున్నారు. కరోనా వైరస్ వ్యాప్తి చెందుతున్న నేపథ్యంలో దక్షిణాఫ్రికా బృందాని వెంట వారి చీఫ్ మెడికల్ ఆఫీసర్ డాక్టర్ షోయబ్ మంజ్రా కూడా వచ్చారు. గురువారం మధ్యాహ్నం ఒంటిగంటన్నర నుంచి ఈ మ్యాచ్ ప్రారంభం కానుంది. ఈ సిరీస్ లో రెండో మ్యాచ్ మార్చి 15 న లక్నోలో, మూడో మ్యాచ్ మార్చి 18 న కోల్‌కతాలో జరుగనుంది.

ఇప్పటికే 16 మందితో కూడిన టీంను సౌతాఫ్రికా ప్రకటించింది. టీం క్వింటన్ డి కాక్ (కెప్టెన్), టెంబా బావుమా, రేసీ వాన్ డెర్ డుసెన్, ఫాఫ్ డు ప్లెసిస్, కైల్ వెరెన్, హెన్రిక్ క్లాసెన్, డేవిడ్ మిల్లెర్, జాన్-జాన్ స్మట్స్, ఆండిలే ఫెహ్లుక్వియో, లుంగి ఎన్గిడి, లూథో సిపమాలా, బ్యూనో హెండ్రిక్స్, ఎన్రిక్ నార్ట్జే, జార్జ్ లిండే మరియు కేశవ్ మహారాజ్ తో కూడిని టీం భారత్ కు చేరుకుంది. అయితే ఈ పర్యటనలో భారత ఆటగాళ్లతో చేతులు కలపకుండా ఉండాలని దక్షిణాఫ్రికా కోచ్ మార్క్ బౌచర్ సూచించాడు. భారతదేశంలో కరోనా వైరస్ యొక్క కేసుల సంఖ్య సోమవారం 40 కి చేరుకుంది. దీంతో సిరీస్ ఆడటానికి వచ్చిన కోచ్ బౌచర్, మ్యాచ్‌కు ముందు మీడియాతో మాట్లాడి, సిరీస్ కంటే కూడా ఆరోగ్యానికే ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వాలని అన్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version