అండర్-19 ఉమెన్స్ టీ 20 వరల్డ్ కప్ ఫైనల్ లో భారత బౌలర్లు విజృంభించారు. దక్షిణాఫ్రికా 20 ఓవర్లలో కేవలం 82 పరుగులు మాత్రమే చేసింది. తెలుగు అమ్మాయి త్రిష 3 వికెట్లు తీసి సత్తా చాటారు. ఆయుషిశుక్లా, వైష్ణవి శర్మ, పరుణిక రెండేసీ వికెట్లతో ఆకట్టుకున్నారు. భారత విజయలక్ష్యం 83. భారత్ మరోసారి కప్పు కొట్టబోతుందని స్పష్టంగా తెలుస్తోంది.
దక్షిణాఫ్రికా బ్యాటర్లలో జెమ్మ బోథ 14 బంతుల్లో 16 పరుగులు చేసింది. మరో ఓపెనర్ డకౌట్ అయింది. వాన్ వస్ట్ 23 పరుగులు చేసి టాప్ స్కోరర్ గా నిలిచింది. ఓపెనర్ లారెన్స్ తో పాటు మరో ముగ్గురు బ్యాటర్లు డకౌట్ కావడం గమనార్హం. భారత మహిళలు కట్టుదిట్టమైన బౌలింగ్ చేయడంతో 82 పరుగులకు కుప్పకూలింది సౌతాఫ్రికా. సునాయసంగా భారత్ మరోసారి వరల్డ్ కప్ కొట్టనుంది.