టాస్‌ గెలిచి బౌలింగ్‌ ఎంచుకున్న సఫారీలు..

-

విశాఖపట్నంలో క్రికెట్ సంబరం నెలకొంది. ఇక్కడి ఏసీఏ-వీడీసీఏ స్టేడియంలో టీమిండియా, దక్షిణాఫ్రికా జట్ల మధ్య మూడో టీ20 మ్యాచ్ జరుగుతోంది. ఈ మ్యాచ్‌లో సౌతాఫ్రికా జట్టు టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకుంది. ఇరు జట్లలో ఎలాంటి మార్పులు లేవు. ఐదు టీ20ల సిరీస్‌లో టీమిండియా రెండు మ్యాచ్‌ల్లో ఇప్పటికే ఓటమి పాలైంది. ఈ మ్యాచ్‌లో గెలిచి విజయ పతాకం ఎగురవేయాలని పంత్ సేన కసి మీద ఉంది. పైగా.. భారత జట్టుకు విశాఖ పిచ్‌లో మంచి ట్రాక్ రికార్డ్ ఉండటం కలిసొచ్చే అంశం. స్పిన్నర్ల నిరాశాజనక బౌలింగ్‌, ఓపెనర్‌ రుతురాజ్‌ పేలవ ఫామ్‌, రిషభ్‌ పంత్‌ కెప్టెన్సీతో పాటు బ్యాటింగ్‌లోనూ విఫలమవుతుండడం మేనేజ్‌మెంట్‌ను కలవరపరుస్తోంది. బలహీనతలను సరిదిద్దుకుని తుది జట్టును పకడ్బందీగా ఎంపిక చేసుకుంటేనే సఫారీలను అడ్డుకోవచ్చు. రెండో మ్యాచ్‌లో దినేశ్‌ కార్తీక్‌కన్నా ముందే అక్షర్‌ను పంపడం బెడిసికొట్టింది.

ఇక స్పిన్నర్ల గురించి చెప్పుకోవడానికేమీ లేకపోయింది. ఐపీఎల్‌లో టాప్‌ బౌలర్‌గా నిలిచిన చాహల్‌తో పాటు అక్షర్‌లను సఫారీలను ఆడేసుకుంటున్నారు. ఈ జోడీ వేసిన 11 ఓవర్లలో 134 పరుగులు సమర్పించుకోవడం గమనార్హం. దక్షిణాఫ్రికా మాత్రం బ్యాటింగ్‌, బౌలింగ్‌లో దూసుకెళుతోంది. తొలి మ్యాచ్‌లో మిల్లర్‌, డుస్సెన్‌ భారత్‌కు షాక్‌ ఇస్తే.. కటక్‌లో కమ్‌బ్యాక్‌ బ్యాటర్‌ క్లాసెన్‌ కదం తొక్కాడు. 29/3 స్కోరుతో కష్టాల్లో పడిన జట్టును తుఫాన్‌ ఇన్నింగ్స్‌తో గట్టెక్కించాడు. ఇక బౌలింగ్‌లో రబాడ, నోకియా, పార్నెల్‌ భారత బ్యాటర్లను ఇబ్బందిపెడుతున్నారు. ఇదే జోరుతో ఈ మ్యాచ్‌లోనూ గెలిస్తే సిరీస్‌ దక్కుతుంది.

 

Read more RELATED
Recommended to you

Exit mobile version