ఆయుధాల ఒప్పందంపై చర్చించేందుకు పుతిన్-కిమ్ భేటీ.. వద్దని వారిస్తున్న అమెరికా

-

ప్రపంచంలో ఇద్దరు బలమైన దేశాధ్యక్షులు త్వరలో భేటీ కానున్నారు. ఉత్తర కొరియా అధ్యక్షుడు కిమ్ జోంగ్ ఉన్ త్వరలో రష్యాలో పర్యటించనున్నారని అమెరికాకు చెందిన ఓ అధికారి తెలిపారు. ఆయన రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్​తో త్వరలో సమావేశం అయ్యే అవకాశం ఉందని వెల్లడించారు. ఉక్రెయిన్​తో యుద్ధం జరుగుతున్నందున రష్యా.. నార్త్ కొరియా ఆయుధాలను సమీకరించాలనుకుంటుదని ఈ నేపథ్యంలోనే ఇరు దేశాల అధ్యక్షుల భేటీ ఉండనుందని సమాచారం.

గత నెలలో రష్యా రక్షణ మంత్రి సెర్గీ షోయిగు ఉత్తర కొరియా వెళ్లారని అమెరికా జాతీయ భద్రత మండలి ప్రతినిధి అడ్రియన్ వాట్సన్ సోమవారం తెలిపారు. క్లెమ్లిన్​కు ఆయుధాలు విక్రయించేలా చర్చలు జరిపారని చెప్పారు. ఈ చర్చలను కొనసాగించాలని, రష్యాలో అధినేతల స్థాయి దౌత్య చర్చలు జరగాలని కిమ్​ జోంగ్ ఉన్ భావిస్తున్నట్లు తమకు సమాచారం ఉందని అన్నారు. ఆయుధ కొనుగోళ్లపై రష్యాతో చర్చలు నిలిపివేయాలని, ఆయుధాలని విక్రయించకూడదని ఉత్తర కొరియాకు అమెరికా కోరుతోందని వాట్సన్ తెలిపారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version