ప్రయాణికులకు శుభవార్త అందించిన దక్షిణ మధ్య రైల్వే

-

ప్రయాణికులకు రైల్వే శాఖ శుభవార్త అందించింది. రైల్వే స్టేషన్లలో జనరల్‌ టికెట్‌ బుకింగ్‌ కౌంటర్ల వద్ద ప్రయాణికులకు నగదు చెల్లింపుల్లో ఇబ్బందులకు చెక్‌ పెట్టింది.నగదు రహిత లావాదేవీలను ప్రోత్సహించడమే లక్ష్యంగా క్యూఆర్‌ కోడ్‌ ద్వారా టికెట్లకు నగదు చెల్లించుకొనే సౌకర్యాన్ని దక్షిణ మధ్య రైల్వే అందుబాటులోకి తీసుకొచ్చింది. గూగుల్ పే, ఫోన్ పే,పేటీఎం, BHIM ద్వారా డబ్బులు చెల్లించవచ్చు.దీంతో ప్రయాణికులకు చిల్లర కష్టాలు తొలగిపోనున్నాయి. సికింద్రాబాద్ డివిజన్ పరిధిలోని 14 స్టేషన్లలోని 31 కౌంటర్ల వద్ద ఈ సౌకర్యాన్ని తీసుకొచ్చారు.ఈవిషయాన్ని దక్షిణ మధ్య రైల్వే ఎక్స్(ట్విట్టర్) లో ప్రకటించింది.

ఇక తాజా నిర్ణయంతో ప్రయాణికులకు కౌంటర్ల వద్ద చిల్లర ఇబ్బందులు తప్పనున్నాయి.అన్‌రిజర్వుడ్‌, ప్లాట్‌ఫాం టికెట్ల కొనుగోలుకు రైల్వేస్టేషన్లలో ఉన్న ఆటోమేటిక్‌ టికెట్ వెండింగ్ మెషిన్‌ (ఏటీవీఎం)లో క్యూఆర్‌ (క్విక్‌ రెస్పాన్స్‌) కోడ్‌తో డబ్బులు చెల్లించే సౌకర్యము ఇదివరకే ఉన్న విషయం తెలిసిందే.

Read more RELATED
Recommended to you

Latest news