రాజకీయ లబ్ధి కోసమే బీజేపీ సదరన్ జోనల్ కౌన్సిల్ సమావేశం పెట్టిందని సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ అన్నాడు. దక్షిణ భారత దేశంలో బీజేపీ బలపర్చల నే ఉద్ధేశం తో నే ఈ సదరన్ జోనల్ కౌన్సిల్ సమావేశం ఆంధ్ర ప్రదేశ్ లో ని తిరుపతి నిర్వహిస్తున్నారని నారాయణ విమర్శించారు. దక్షిణ భారత దేశంలో బీజేపీ చాలా బలహీనం గా ఉందని అన్నారు. దీంతో పార్టీ ని ఇక్కడ బలపర్చాలనే ఉద్ధేశం తోనే ఈ సమావేశాన్ని నిర్వహిస్తున్నారని ఆరోపించారు.
అందు కోసమే అమిత్ షా వస్తున్నాడని అన్నాడు. దర్శనాల కోసమే ప్రతినిధులు సమావేశానికి వస్తున్నట్లు ఉందని అన్నారు. అలాగే జీఎస్‌టీ ఆదాయం గురించి రాష్ట్రాల కు ఇచ్చిన హామీ ని కేంద్ర ప్రభుత్వం విస్మరించిందని అన్నారు. రాష్ట్రాలు అప్పులు చేస్తున్నాయంటే దానికి కారణం కేంద్ర ప్రభుత్వమే అని తెలిపారు. అలాగే ఇప్పటి వరకు కేంద్రం ఆంధ్ర ప్రదేశ్ రాజధాని ఎందుకు గుర్తించలేదని ప్రశ్నించారు. దీంతో పాటు ఆంధ్ర ప్రదేశ్ కు ప్రత్యేక హోదా గురించి ముఖ్య మంత్రి జగన్ కేంద్రాన్ని ప్రశ్నించాలని సూచించాడు. ఆర్టికల్ 21ని హరించేలా కేంద్రం , రాష్ట్ర ప్రభుత్వాలు నాటకాలు ఆడుతున్నాయని మండి పడ్డాడు. నిరసన తెలిపే హక్కు రాజ్యాంగబద్దంగా ప్రతి ఒక్కరికి ఉంటుందని అన్నారు.