నేడు తెలంగాణా రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పుట్టిన రోజు అన్న సంగతి తెలిసిందే.. ఈ తరుణంలోనే యాదాద్రికి సీఎం రేవంత్ రెడ్డి వెళ్లనున్నారు. పుట్టిన రోజు సందర్భంగా ఇవాళ యాదగిరిగుట్ట శ్రీలక్ష్మి నరసింహస్వామిని దర్శించుకోనున్నారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. ఈ సందర్భంగా యాదాద్రి ఆలయ అభివృద్ధి కార్యక్రమాలు, YTDAపై సమీక్ష ఉంటుంది.
అనంతరం వలిగొండ మండలం సంగెంలోని మూసీ మూడు పాయల వద్ద ఉన్న భీమలింగాన్ని సందర్శించనున్నారు రేవంత్ రెడ్డి. అనంతరం మూసీ పరివాహక ప్రాంతంలో దాదాపు రెండున్నర కిలోమీటర్ల పాదయాత్ర చేయనున్నారు తెలంగాణా రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి.
అనంతరం అక్కడి నుంచి సంగెం ప్రాంతానికి చేరుకుంటారు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. ఇక అక్కడి నుంచి భీమ లింగంలోని మూసి నది వరకు 2.5 కిలోమీటర్ల మేర పాదయాత్ర చేస్తారు. అనంతరం అక్కడి నుంచి తిరిగి ధర్మారెడ్డి పల్లి కెనాల్ కట్ట వెంబడి సంగెం- నాగిరెడ్డిపల్లి రోడ్డు వరకు పాదయాత్ర నిర్వహిస్తారు రేవంత్ రెడ్డి. అనంతరం అక్కడే రేవంత్ రెడ్డి ప్రసంగం కూడా ఉంటుంది.