సోయా పన్నీరు పరోటా.. షుగర్ పేషంట్స్ కు మంచి ఫుడ్ ఐటమ్..!

-

పన్నీర్ సోయా పరోటా డయబెటీస్, ఒబిసిటీ పేషంట్ కు మంచి ఆహారం. కార్బోహైడ్రేట్స్ తక్కువ ప్రొటీన్ ఎక్కువ. బరువు తగ్గడానికి, డయబెటీస్ కంట్రోల్లో ఉండటానికి చాలా బాగా పనిచేస్తుంది. రెండు మూడు పరోటాలు తింటే చాలు. ఈరోజు మనం నాచురల్ పద్దతిలో సోయా పన్నీరు పరోటా ఎలా తయారు చేసుకోవాలో చూద్దామా..!

సోయా పన్నీరు పరోటా తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు..

మల్లీగ్రెయిన్ పిండి ఒక కప్పు
పెరుగు అరకప్పు
పన్నీరు తురుము అరకప్పు
ఉడకపెట్టిన మీల్ మేకర్స్ పొడి అరకప్పు
క్యారెట్ తురుము అరకప్పు
క్యాప్సికమ్ స్లైసెస్ అరకప్పు
క్యాబేజీ ముక్కలు అరకప్పు
మిరియాలపొడి ఒక టేబుల్ స్పూన్
వాము ఒక టేబుల్ స్పూన్
మీగడ ఒక టేబుల్ స్పూన్
లెమన్ జ్యూస్ ఒక టేబుల్ స్పూన్
కొత్తిమీర కొద్దిగా

తయారు చేసే విధానం..

ముందుగా ఒక బౌల్ తీసుకుని మల్టీగ్రెయిన్ పిండి అందులో వేసేసి వాము, పెరుగు వేసి చపాతి పిండిలా కలుపుకుని 20 నిమిషాలు అలా ఉంచండి. పొయ్యిమీద నాన్ స్టిక్ పాత్ర తీసుకుని అందులో జీలకర్ర, మీగడ, క్యాబేజీ, క్యాప్సికమ్, క్యారెట్ తురుము వేసేసి సిమ్ లో ఉంచి 7-8 నిమిషాలు ఉంచండి. ఉడికించి నీళ్లు పిండేసిన మీల్ మేకర్స్ ను పొడిలా చేసుకుని ఆ పొడిని కూడా వేయండి. పన్నీరు తురుము, జీలకర్ర పొడి, మిరియాల పొడి, నిమ్మరసం, కొత్తిమీర వేసేసి మూతపెట్టి 5-7 నిమిషాలు మగ్గనించి తీసేయండి.

ఆ తర్వాత ముందు కలుపుకున్న పరోటాల పిండి తీసుకుని పరోటాలు చేయండి. అందులో రెండు టేబుల్ స్పూన్ల చొప్పున ముందు చేసుకున్న కర్రీ మధ్యలో వేసి సైడ్స్ వాటర్ తో తడి చేసి నాలుగు వైపులా మడవండి. నాన్ స్టిక్ ప్యాన్ పై పెట్టి మీగడ రాసుకుంటూ కాల్చుకోవడమే. రైలు ప్రయాణాల్లో ఇలాంటివి తీసుకెళ్తే పాడవకుండా ఉంటాయి. టేస్టీగా కూడా ఉంటుంది. ఇలాంటి కాంబినేషన్ తో చేసుకుంటే.. ఆరోగ్యానికి మంచిది..ఎంజాయ్ చేస్తూ తినొచ్చు.

Read more RELATED
Recommended to you

Exit mobile version