భారతీయ దిగ్గజ గాయకుల్లో ఒకరైన ఎస్సీ బాలసుబ్రహ్మణ్యం మృతితో చిత్రపరిశ్రమలో విషాదం నెలకొంది. ఘంటసాల మరణం తర్వాత తెలుగు సినిమా పాటలకు ఎస్పీ బాలుయే పెద్ద దిక్కయ్యారు. తన గాత్రంతో పాత్రలకు ప్రాణం పోశాడు. ఎస్సీ బాలు మరణంతో ఆయన కుటుంబం శోకసంద్రంలో మునిగిపోయింది. మరోవైపు బాలు అంత్యక్రియలకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. చెన్నై సమీపంలోని మహలింగపురం కామదార్ నగర్‌లోని ఆయన నివాసానికి నేడు సాయంత్రం 4 గంటలకు భౌతిక కాయాన్ని తరలించనున్నారు. రేపు ఉదయం వరకు ఇంటి వద్దనే బాలు భౌతికకాయం ఉండనుంది.
ఆ తర్వాత అభిమానులు సందర్శన కోసం శుక్రవారం ఉదయం సత్యం థియేటర్‌కు తీసుకెళ్లనున్నారు. అభిమానులు పెద్ద ఎత్తున తరలివచ్చే అవకాశం ఉండటంతో పెద్ద భారీగా పోలీస్ బందోబస్త్‌ను ఏర్పాటు చేస్తున్నారు. శనివారం మధ్యాహ్నం తర్వాత చెన్నై శివారు రెడ్‌హిల్స్‌లోని ఫామ్‌హౌస్‌లో అంత్యక్రియలు నిర్వహించనున్నారు. దీని కోసం ప్రత్యేకంగా తయారుచేసిన చేసిన అంతిమయాత్ర రథం సిద్ధంగా ఉంచారు.