స్పెయిన్ మంత్రి,ఉప ప్రధాని ని కూడా వదలని కరోనా!!

-

స్పెయిన్ మంత్రి ఇరెనే మాంటెరో కరోనా మహమ్మారి బారిన పడినట్లు తెలుస్తుంది. తనకు కోవిద్-19 పాజిటివ్ ఉన్నట్లు పరీక్షల్లో తేలింది అంటూ ఆమె ట్విట్టర్ ద్వారా వెల్లడించారు. ప్రపంచ దేశాలను వణికిస్తున్న ఈ కరోనా మంత్రులు,ఎంపీ లను సైతం వదలడం లేదు. ఇప్పటికే ఈ కరోనా బారిన పడి 4 వేల మందికి పైగా మృతు వాత పడగా, వేలాదిమంది ఆసుపత్రి పాలవుతున్న సంగతి తెలిసిందే. చైనా లో మొదలైన ఈ మహమ్మారి ప్రపంచ దేశాలకు పాకింది. చైనా లో ఇప్పుడిప్పుడే కరోనా కేసులు తగ్గుముఖం పడుతున్నప్పటికీ ఇతర దేశాల్లో మాత్రం ఈ కరోనా ప్రభావం విపరీతంగా ఉంది. ఇటలీ,ఇరాన్ వంటి దేశాల్లో ఈ కరోనా కేసులు రోజు రోజుకూ పెరుగుతూ పోతున్నాయి. దీనితో అధికారులు ఆందోళన చెందుతున్నారు. అయితే ఇటీవల పలువురు ఎంపీలు,మంత్రులను సైతం ఈ కరోనా వదలడం లేదు. గతంలో ఇరాన్ లో డిప్యూటీ ఆరోగ్య మంత్రి, 23 ఎంపీ లకు కరోనా సోకడం తో అక్కడ పరిస్థితులపై అధికారులు ఆందోళన చెందారు. మరోపక్క కరోనా సోకి ఇరాన్ మంత్రి సలహాదారు కూడా మృతి చెందడం తో పరిస్థితులు మరింత ఆందోళన కలిగిస్తున్నాయి.

తాజాగా స్పెయిన్ మంత్రి కి కూడా ఈ కరోనా వైరస్ సోకడం తో ప్రస్తుతం ఆమెకు ఇంటి వద్దనే ప్రత్యేకంగా చికిత్స అందిస్తున్నట్లు ఆమె భర్త, స్పెయిన్ ఉపప్రధాని పబ్లో ఇగ్లేసియా ట్విట్టర్ లో తెలిపారు. అయితే ప్రస్తుతం నేను కూడా ఇంటివద్దనే పరిశీలనలో ఉన్నానని, కరోనా పరీక్షల ఫలితాల కోసం ఎదురుచూస్తున్నట్లు పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో ప్రభుత్వంలోని సభ్యులంతా కూడా కరోనా పరీక్షలు చేయించుకోవాలంటూ ప్రభుత్వం ఒక ప్రకటనలో పేర్కొన్నట్లు తెలుస్తుంది.

Read more RELATED
Recommended to you

Exit mobile version