ఆస్ట్రేలియా అమ్మాయిని పెళ్లాడిన అనంతపురం అబ్బాయి..

-

ప్రేమకు కుల, మత ప్రాంతాలు లేవని మరోసారి రుజువైంది. ఈ క్ర‌మంలోనే విదేశీ యువతులను పెళ్లాడుతున్న తెలుగు రాష్ట్రాల యువకుల సంఖ్య పెరుగుతోంది. స్పానిష్ అమ్మాయి, ఆంధ్రా అబ్బాయి వివాహబంధంతో ఒక్కటయ్యారు. అనంతపురం జిల్లా తాడిపత్రికి చెందిన విజయకుమార్‌ వృత్తిరీత్యా వైద్యుడు. బత్తలపల్లిలోని ఆర్టీటీ ఆస్పుత్రిలో వైద్యుడిగా పనిచేస్తున్నాడు. స్పెయిన్‌ దేశానికి చెందిన కార్లా అనే యువతి వృత్తి రీత్యా దంత వైద్య నిపుణురాలు.

ఈమె కూడా ఇక్కడే ఆర్డీటీ ఆస్పత్రిలో వైద్యురాలిగా పనిచేస్తున్నారు. రెండేళ్ల క్రితం వీరిద్దరికి పరిచయం ఏర్పడింది. ఇటీవల స్పెయిన్ అమ్మాయిని తాడిపత్రికి చెందిన అబ్బాయి పెళ్లాడాడు. కొంతకాలానికి వీరి మధ్య ప్రేమ చిగురించింది. దాంతో ఇద్దరు పెళ్లి చేసుకోవాలనే నిర్ణయించుకున్నారు. వీరి ప్రేమకు ఇరు కుటుంబాల పెద్దలు అంగీకరించారు. దీంతో శుక్రవారం హన్మకొండలో హిందూ సంప్రదాయ పద్ధతిలో వీరి వివాహం వైభవంగా జరిగింది.

Read more RELATED
Recommended to you

Latest news