speaker gaddam prasad: తెలంగాణ రాష్ట్ర మహిళలకు అదిరిపోయే శుభవార్త చెప్పింది రేవంత్ రెడ్డి ప్రభుత్వం. తాజాగా మహిళలకు నెలకు 2500 విషయంలో… కీలక ప్రకటన చేసింది. 2025 అంటే కొత్త సంవత్సరం లో ఈ స్కీం ప్రారంభం కాబోతున్నట్లు తెలుస్తోంది. దీనిపై తెలంగాణ స్పీకర్ గడ్డం ప్రసాద్ కీలక ప్రకటన చేశారు. మహాలక్ష్మి పథకం కింద అర్హులైన మహిళలకు నెలకు 2500 అలాగే కళ్యాణ లక్ష్మి ద్వారా తులం బంగారం.. కొత్త సంవత్సరంలో అందిస్తామని ఆయన వెల్లడించారు.
అలాగే రైతుబంధు డబ్బులను కూడా త్వరలోనే రిలీజ్ చేస్తామని కూడా ప్రకటన చేశారు. డిసెంబర్ 9 తారీకు వరకు… పెండింగ్లో ఉన్న సర్పంచ్ల బిల్లులు కూడా విడుదల చేయనున్నట్లు వివరించారు. గత పాలకుల కారణంగా తెలంగాణ ఆర్థిక వ్యవస్థ… చిన్నాభిన్నమైందని ఫైర్ అయ్యారు. అందుకే సంక్షేమ పథకాలు అమలు చేయడంలో జాబ్ చేయడం జరుగుతుందని వివరించారు.