”వకీల్ సాబ్” సినిమాపై స్పీకర్ సీతారాం సంచలన వ్యాఖ్యలు

శ్రీకాకుళం : ఏపీ స్పీకర్ తమ్మినేని సీతారాం మరో సారి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇవాళ ఆయన మీడియా తో మాట్లాడుతూ.. ఆఫ్ షోర్ రిజర్వాయర్ ను పూర్తి చేసి హనుమంతు అప్పయ్య దొర పేరు పెడతామని ఆయన తెలిపారు. పదవులు శాశ్వతం కాదని…..మనం చేసే పనులే శాశ్వతమని స్పష్టం చేశారు. అప్పయ్య దొర ఆశయాల ను కొనసాగిస్తామని పిలుపు నిచ్చారు స్పీకర్‌ తమ్మినేని సీతారాం.

అంతేకాదు… ఈ నేపథ్యం లో నే పవర్‌ స్టార్‌ పవన్‌ కళ్యాణ్‌ నటించిన వకీల్‌ సాబ్‌ సినిమా పై కూడా ఏపీ స్పీకర్‌ ఆసక్తి కర వ్యాఖ్యలు చేశారు. వకీల్ సాబ్ సినిమా చూస్తుంటే అప్పయ్య దొరే గుర్తుకు వచ్చారని… వకీల్ సాబ్ సినిమాను అప్పయ్య దొరకు అంకితం చేయొచ్చని పేర్కొన్నారు. సినిమా లో పవన్ క్యారెక్టర్ మాదిరిగానే అప్పయ్య దొర లో ఆ తరహా పోరాటాన్ని తాను స్వయంగా చూశానని వివరించారు స్పీకర్‌ తమ్మినేని సీతారాం.