శ్రీకాకుళం జిల్లాలో స్పీకర్ తమ్మినేని సీతారాం మాట్లాడుతూ.. చిలకపాలేంలో ఎన్ఏసీఎల్ నాగార్జున కెమికల్స్ ఫ్యాక్టరీ విపరీతమైన కాలుష్యాన్ని వెదజల్లుతుందన్నారు. ఆ కాలుష్యం భూమిలోకి పోతుంది.. పోందురు మండలంలోని జల వనరులన్నీ కలుషితమై పోతున్నాయన్నారు. ఆయా గ్రామాల్లో పిల్లలు అంగవైకల్యంతో పుడుతూ.. క్యాన్సర్ బారిన పడుతున్నారని ఆయన వ్యాఖ్యనించారు. ఫ్యాక్టరీతో గాలి కూడా కాలుష్యం అవుతోంది.. మా ఊళ్లో మా ఇంటి దగ్గరకు కూడా గాలి కాలుష్యంతో దూలి వస్తుందన్నారు.
మూడు సార్లు చంద్రబాబుకి అవకాశం ఇస్తే.. టీడీపీ వారు ఏం చేశారు.. ఇప్పుడు మాకు అవకాశం ఇవ్వండి అంటున్నాడు చంద్రబాబు.. సంక్షేమ పథకాలు నీ హయాంలో ఏందుకు చేయలేకపోయావ్.. ప్రజల ద్వారా వచ్చిన పన్నుల డబ్బుని ప్రజలకే ఇస్తున్నారు.. చంద్రబాబు మాత్రం దొరికింది దొరికినట్లుగా దోపిడి చేశాడు అని తమ్మినేని సీతారం అన్నారు.
ఇది ఇలా ఉంటె, 2024 ఎన్నికల్లో తమ్మినేని సీతారాంకు ఎట్టి పరిస్థితుల్లో టిక్కెట్ ఇచ్చే ఛాన్స్ లేదని ప్రచారం జరుగుతోంది. జగన్ చేయించిన అన్ని సర్వేల్లో ఆయనకు ప్రతికూల ఫలితమే వస్తోంది. తమ్మినేని మాత్రం తాను ఈసారి తప్పుకొని.. కుమారుడికి టిక్కెట్ ఇవ్వాలని జగన్ ను కోరుతున్నారు. అయితే తమ్మినేని కుటుంబంలో ఎవరు నిలబడినా ఓటమి తప్పదని సర్వేలు తేల్చి చెబుతున్నాయి. అందుకే ఒక కొత్త ముఖం కోసం హై కమాండ్ వెతుకుతున్నట్లు తెలుస్తోంది.అయితే తమ్మినేని మాత్రం పట్టువదలని విక్రమార్కుడిలా ప్రయత్నిస్తూనే ఉన్నారు. అధినేత జగన్ ను ప్రత్యేకంగా విజ్ఞప్తి చేస్తున్నారు.