కాంట్రాక్టర్ కి ఒక రేంజ్ లో వార్నింగ్ ఇచ్చిన స్పీకర్ తమ్మినేని భార్య

-

శ్రీకాకుళం జిల్లా కలివరం స్కూల్లో మధ్యాహ్న భోజనాన్ని నిన్న ఏపీ స్పీకర్ తమ్మినేని సీతారాం భార్య, తాజాగా జరిగిన ఎన్నికల్లో స్పీకర్ స్వగ్రామం తొగరాం సర్పంచ్ గా ఎన్నికయిన తమ్మినేని వాణీ తనిఖీ చేశారు. ఈ నేపథ్యంలో భోజనం మంచిగా లేదని, పిల్లలకు నాణ్యమైన భోజనం పెట్టాలని కాంట్రాక్టర్ కి వార్నింగ్ ఇచ్చారు. వాణి సీతారాం ఒక పాఠశాలను పరిశీలించినప్పుడు, విద్యార్థులకు అందించిన ఆహారం అసలు ఏమాత్రం బాలేదని గుర్తించారు.

దీంతో కాంట్రాక్టర్‌ కు కాల్ చేసిన ఆమె ఆహార నాణ్యత గురించి వార్నింగ్ ఇచ్చారు. అంతే కాక పిల్లలకు నాణ్యమైన ఆహారాన్ని అందించనందుకు గాను వారిపై సరైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. తాను విజయవాడ వెళ్లి సిఎంను కలవబోతున్నానని, దీనికి సంబంధించి ఫిర్యాదు చేస్తానని ఆమె ఫోన్ లో వార్నింగ్ ఇచ్చారు. ఇక ఈ వీడియో సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతోంది.  

Read more RELATED
Recommended to you

Exit mobile version