పండుగ ప్రత్యేకం…5252 బస్సులు

-

సంక్రాంతి పండగ సందర్భంగా తెలుగు రాష్ట్రాల్లోని ప్రతీ జిల్లాలతో పాటు ముఖ్య పట్టణాలకు తెలంగాణ ఆర్టీసీ ప్రత్యేక బస్సులను నడపనుంది. ప్రమాణికుల రద్దీని దృష్టిలో ఉంచుకుని ఆర్టీసీని సేవలను అందించనున్నారు.. జనవరి 9 నుంచి 15 వరకు 5,252 సర్వీసులను నడిపేందుకు చర్యలు చేపట్టింది.

వీటిని కేవలం ఎంజీబీఎస్‌, జేబీఎస్‌ నుంచే కాకుండా నగరంలోని పలుచోట్ల ఎటువైపు బస్సులు అటే వెళ్లేలా ఏర్పాట్లుచేసింది.. స్పెషల్ బస్సుల్లో 50శాతం ఛార్జీలు అదనంగా వసూలుచేస్తారు. ఎంజీబీఎస్, పాత సీబీఎస్‌, జూబ్లీ బస్‌స్టేషన్‌, కాచిగూడ, ఉప్పల్‌ క్రాస్‌ రోడ్‌, ఎల్బీనగర్‌, లింగంపల్లి, చందానగర్‌, ఈసీఐఎల్‌, కేపీహెచ్‌బీ, ఎస్‌ఆర్‌ నగర్‌, అమీర్‌పేట, టెలిఫోన్‌ భవన్‌, దిల్‌సుఖ్‌నగర్‌ బస్‌స్టేషన్‌ వీటిని నడపనున్నారు.  తెలంగాణలోని వివిధ పట్టణాలతో పాటు ఏపీలోని విజయవాడ, విజయనగరం, విశాఖ పట్నం, తెనాలి, గుంటూరు, గుడివాడ, రాజమండ్రి, కాకినాడ, రాజోలు, పోలవరం, మచిలీపట్నం, ఏలూరు, తాడేపల్లిగూడెం, తణుకు, విశాఖపట్నం, శ్రీకాకుళం, భీమవరం, తదితర ప్రాంతాలకు బస్సులకు బస్సులను నడపనున్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version