రామ్ చరణ్ పుట్టినరోజు సీడీపీ వచ్చేసింది

-

ఈ నెల 27వ తేదీన మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ పుట్టిన రోజు. ఆయన ఆస్కార్ వేదిక వరకూ వెళ్లి వచ్చిన తరువాత జరుపుకుంటున్న పుట్టిన రోజు ఇది. అందువలన ఈ సారి ఆయన పుట్టినరోజు మరింత ప్రత్యేకతను సంతరించుకుంది. అందువలన రేపటి నుంచే ఈ సందడి మొదలు కానుంది. రామ్ చరణ్ పుట్టినరోజు సందర్భాన్ని పురస్కరించుకుని, రేపు స్పెషల్ సీడీపీ ని విడుదల చేయనున్నారు.

ఈ విషయాన్ని తెలియజేస్తూ, అధికారిక పోస్టర్ ను కొంతసేపటి క్రితమే వదిలారు. రేపు సాయంత్రం 6 గంటలకి స్పెషల్ సీడీపీ రిలీజ్ ఉంటుందని స్పష్టం చేశారు. ఇక 26 .. 27వ తేదీల్లో చరణ్ మూవీ ‘ఆరెంజ్’ స్పెషల్ షోస్ వేస్తున్నారు. ప్రస్తుతం చరణ్ .. శంకర్ సినిమా ‘ఆర్ సి 15’ చేస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే ఈ సినిమా చాలా వరకూ చిత్రీకరణను జరుపుకుంది. కియారా హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమా, పాన్ ఇండియా స్థాయిలో ప్రేక్షకులను అలరించనుంది. ఆ తరువాత సినిమాను గౌతమ్ తిన్ననూరి దర్శకత్వంలో చరణ్ చేయనున్నట్టు తెలుస్తోంది.త్వరలో హాలీవుడ్ లో కూడా చరణ్ ఎంట్రీ ఇవ్వనున్నారని సమాచారం.

 

Read more RELATED
Recommended to you

Exit mobile version