సాయిధరమ్‌తేజ్‌ ‘విరూపాక్ష’ నుంచి సాంగ్ రిలీజ్

-

మెగా హీరో సాయిధరమ్ తేజ్ 15వ చిత్రంగా వస్తున్న చిత్రం ‘విరూపాక్ష’. ఈ సినిమాకి కార్తీక్ దండు దర్శకత్వం వహిస్తున్నాడు. మలయాళ బ్యూటీ సంయుక్తా మీన‌న్ ఫీమేల్ లీడ్‌ రోల్‌ పోషిస్తోంది. ఇప్పటికే ఉగాది సందర్భంగా సాయిధరమ్‌ తేజ్‌ జీప్‌పై కూర్చున్న స్టిల్‌ విడుదల చేయగా, నెట్టింట హల్ చల్ చేస్తోంది. తాజాగా విరూపాక్ష ఫస్ట్ సింగిల్ అప్‌డేట్ కూడా తెలియచేశారు. ఫస్ట్ సింగిల్ నచ్చావులే నచ్చావులే లిరికల్ వీడియో సాంగ్‌ను మార్చి 24 (రేపు) లాంఛ్ చేస్తున్నట్టు మేకర్స్ ప్రకటించారు. సాయిధరమ్‌ తేజ్‌, సంయుక్తా మీనన్‌ అందమైన కొండల మధ్య చేనులో కూర్చున్న లుక్‌ సాంగ్ ఎలా ఉండబోతుందో తెలియజేస్తూ.. క్యూరియాసిటీ పెంచుతోంది.

విరూపాక్ష తెలుగు, తమిళ భాషల్లో తెరకెక్కనుంది. ఇప్పటికే విడుదలైన విరూపాక్ష టైటిల్ గ్లింప్స్ వీడియో, టీజర్‌కు మంచి స్పందన వస్తోంది.కాంతార ఫేం అంజనీశ్‌ లోక్‌నాథ్‌ విరూపాక్ష చిత్రానికి మ్యూజిక్ డైరెక్టర్‌.
శ్రీ వెంకటేశ్వర సినీ చిత్ర-సుకుమార్ రైటింగ్స్ బ్యాన‌ర్లపై బీవీఎస్‌ఎన్‌ ప్రసాద్‌ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. విరూపాక్షలో బ్రహ్మాజీ, అజ‌య్‌, సునీల్ కీలక పాత్రల్లో నటిస్తున్నారు. సాయిధరమ్‌ తేజ్ మరోవైపు సముద్రఖని దర్శకత్వంలో వినోదయ సీతమ్‌ తెలుగు రీమేక్‌లో వన్‌ ఆఫ్ ది లీడ్‌ రోల్‌లో నటిస్తుండగా.. ప్రస్తుతం షూటింగ్ దశలో ఉంది.

 

Read more RELATED
Recommended to you

Exit mobile version