జీ-20 సదస్సులో నోరూరించే వంటకాలు..

-

ఈసారి జీ 20 దేశాధినేతల సదస్సుకు భారత్ ఆతిథ్యం ఇస్తోంది. ఈ సమావేశాలను ప్రతిష్ఠాత్మకంగా భావిస్తున్న భారత్.. దీనికి సంబంధించి పటిష్ఠ ఏర్పాట్లు చేస్తోంది. ఈ క్రమంలోనే జీ 20 దేశాధినేతలు రానున్న నేపథ్యంలో వారికి కావాల్సిన ఏర్పాట్లు, సౌకర్యాలను చూస్తోంది. వివిధ దేశాధినేతలు వస్తుండడంతో వారి కోసం నోరూరించే వంటకాలు సిద్ధం చేయనున్నారు. ప్రపంచ దేశాధినేతలకు, వారితో పాటు వచ్చే అధికారులు, ప్రతినిధుల బృందాలకు పేరుమోసిన హోటళ్లలో బస ఏర్పాటు చేస్తున్నారు.

ఈ నేపథ్యంలో, ఆయా హోటళ్లలో రుచికరమైన, భారతీయ విశిష్టతను చాటే వంటకాలను అందుబాటులో ఉంచనున్నారు. ముఖ్యంగా, తృణ ధాన్యాలతో తయారైన వంటకాలను ప్రత్యేకంగా వండి వడ్డించనున్నారు.

జీ-20 సదస్సు అతిథులకు అందించే మెనూలో దేశంలోని పలు రాష్ట్రాల ఫేమస్ వంటకాలు, విదేశీ వంటకాలు సిద్ధం చేయనున్నారు. మొత్తం 250 రకాల స్వదేశీ, విదేశీ వంటకాలకు మెనూలో చోటు కల్పించారు. అతిథి మర్యాదలకు ఎలాంటి లోటు ఉండకూడదని కేంద్రం భావిస్తోంది.

Read more RELATED
Recommended to you

Exit mobile version