వైర‌ల్ పిక్ : మిస్ట‌ర్ కూల్ యువ రాజు రాహుల్

-

మండుటెండ‌ల్లో ఐస్ క్రీమ్ తిన‌డంలో త‌ప్పేంటి
అయినా రాజ‌కీయాలు అన్నాక గెలుపు మ‌రియు
ఓట‌మి ఉండి ఉంటుంది..
ఈ పాటి దానికే రాహుల్ ని ఎందుకు అంతా
ఆడిపోసుకోవ‌డం..?

ఎప్ప‌టి నుంచో కాంగ్రెస్ పార్టీకి  రథసారధిగా ఉంటూ పార్టీని న‌డిపి ఓ విజ‌య తీరానికి చేర్చాల్సిన రాహుల్ ఆ ప‌ని మాత్రం ఇప్ప‌టిదాకా ఒక్క‌సారంటే ఒక్క‌సారి కూడా చేయ‌లేక‌పోతున్నారు అన్న‌ది నిష్టుర స‌త్యం.అయినా కూడా ఆయ‌న విదేశీటూర్లకు పోతారు.స‌మ్మ‌ర్ వెకేష‌న్ కు ఎక్క‌డో ఉంటారు.పార్టీ పీక‌ల్లోతు క‌ష్టాలు ఉన్నా ప‌ట్టించుకోరు.ఒక రోజు దేశానికి స్వాతంత్రం తీసుకువ‌చ్చిన పార్టీకి ఇవాళ ఆ స్థాయి విజయాలు లేనేలేవు అయినా కూడా ఐస్ క్రీమ్ తినుకుంటూ,గోళ్లు గిల్లుకుంటూ కాలం ఖ‌ర్చు చేయ‌డం రాహుల్ మార్కు.
వైఫ‌ల్యాలు ఎన్ని ఉన్నా…? 
ప‌ట్టింపు లేనే లేదు..ఆయ‌నంతే అదో టైపు
2024 లోక్ సభ ఎన్నికలకు సెమీ ఫైనల్స్ గా భావించిన 2022 ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఘోరమైన పరాజయాన్ని చవిచూసింది. ఆ పార్టీ అధికారంలో ఉన్న పంజాబ్ రాష్ట్రంలో సైతం ఓటమి చెందడం, సంబంధిత నాయకుల్ని  నిరాశకు గురిచేస్తుంటే ఆ పార్టీ యువరాజు ఏం చేస్తున్నాడో తెలుసా..? భారత దేశ రాజకీయాల్లో కాంగ్రెస్ పార్టీ యువరాజుగా పేరొందిన రాహుల్ గాంధీ.. క్రియాశీలక రాజకీయాల్లోకి వచ్చి మరియు అనధికారికంగా పార్టీ ప‌గ్గాలు అందుకుని సుమారు 19 ఏళ్ళు దాటుతున్నా సంబంధిత విషయ పరిణితిని మాత్రం సాధించలేకపోయారు. దీంతో మార్గనిర్దేశనం లేని కాంగ్రెస్ పార్టీ పరిస్థితి అధ్వానంగా తయారయ్యింది. ఇందుకు ఎవరూ ఏమనుకున్నా స‌రే! న‌వ్వి పోదురు గాక నాకేమీ సిగ్గు అన్న చందన పార్టీ కార్యక్రమాలు కంటే విదేశీ పర్యటనలు,స్నేహితులతో పార్టీలే ముఖ్యంగా భావిస్తున్నరాహుల్ కి  ఐదు రాష్ట్రాల ఎన్నికల ఫలితాలు ఏమంత బాధించలేదన్న‌ది సుస్ప‌ష్టం.
ఆయ‌నంతే ఉల‌క‌రు..ప‌ల‌క‌రు
ప‌ట్టించుకోరు..ఆఖ‌రికి అర్థం అవ్వ‌రు
ఐదు రాష్ట్రాల ఎన్నికల సందర్భంగా రాహుల్  పర్యటన చేసిన పంజాబ్,ఉత్తరాఖండ్ రాష్ట్రాల్లో కాంగ్రెస్ పార్టీ ఓటమి చెందడం మాత్రమే కాకుండా ఆయన ద్వారా ప్రకటన‌కు నోచుకున్న అనధికార ముఖ్యమంత్రి అభ్యర్థులైన సిద్ధూ, హరీశ్ రావత్ లు ఓటమి చెందడం మరో విశేషం. 2024 లోక్ సభ ఎన్నికల తర్వాత కాంగ్రెస్ పార్టీని దేశంలో లేకుండా చేస్తామని అధికార బీజేపీ,ప్రాంతీయ పార్టీలు ముక్తకంఠంతో చెబుతున్నప్ప‌టికీ రాహుల్ మాత్రం ఉలకరు.. పలకరు.ఎందుకంటే పార్టీ కార్యక్రమాలు కంటే బోలెడన్ని పనులు ఆయ‌న‌కు ఉన్నాయి క‌నుక. ఇంత‌టి నిరాశ పూర్వ‌క వాతావర‌ణంలో రాన్రానూ పార్టీకి గుదిబండగా మారుతున్న రాహూల్ ను పార్టీ నుంచి తప్పించేందుకు ఎవరికి మనసొప్పడం లేదు..అందేంటో!

Read more RELATED
Recommended to you

Exit mobile version