శ్రీశైలం, వేములవాడ కి స్పెషల్ టూర్ ప్యాకేజీ…ఈ ప్రదేశాలన్నింటినీ చూసి వచ్చేయండి..!

-

తెలంగాణ టూరిజం ఇప్పటికే చాలా రకాల ప్యాకేజీలని తీసుకు వచ్చింది. ఈ ప్యాకేజీ తో
వేసవిలో శ్రీశైలం, వేములవాడ, కాళేశ్వరం వెళ్లి వచ్చేయచ్చు. శైవ క్షేత్రాలకు టూర్ ప్యాకేజీలు ఆపరేట్ చేస్తోంది తెలంగాణ టూరిజం. ఇక మరి దీని గురించి పూర్తి వివరాలు చూసేద్దాం. తెలంగాణ టూరిజం ఏసీ బస్సులో ఈ శ్రీశైలం టూర్ ప్యాకేజీ ని తీసుకు వస్తోంది. మొదటి రోజు ఉదయం 8.30 గంటలకు హైదరాబాద్‌లో ఈ టూర్ స్టార్ట్ అవుతుంది. సాయంత్రం 5 గంటలకు శ్రీశైలం రీచ్ అవుతారు. శ్రీశైలంలో సాక్షి గణపతి ఆలయ దర్శనం చేసుకోవచ్చు.

తర్వాత శ్రీశైలంలో మల్లికార్జున స్వామి దర్శనం ఉంటుంది. ఇక రెండో రోజు అయితే రోప్ వే ద్వారా పాతాళ గంగ, పాలధార, పంచధార, శిఖరం, డ్యామ్ ని చూసి వచ్చేయచ్చు. సాయంత్రం మళ్ళీ తిరుగు ప్రయాణం ఉంటుంది. సాయంత్రం 7 గంటలకు హైదరాబాద్ రీచ్ అవుతారు. అంతే టూర్ ముగుస్తుంది. ఇక ధర విషయానికి వస్తే.. పెద్దలకు రూ.2400. పిల్లలకు రూ.1920 గా వుంది. తెలంగాణ టూరిజం కాళేశ్వరం ఒక రోజు టూర్ ప్యాకేజీ ని ఆపరేట్ చేస్తోంది. తెల్లవారుజామున 5 గంటలకు స్టార్ట్ అయితే వరంగల్ హరిత కాకతీయ హోటల్‌కు 8 గంటలకు చేరుకుంటారు. బ్రేక్‌ఫాస్ట్ అయ్యాక రామప్పలో రామలింగేశ్వర స్వామి ఆలయ సందర్శన ఉంటుంది.

sమేడిగడ్డ బ్యారేజ్, కనేపల్లి పంప్ హౌజ్ కూడా చూసేయచ్చు. ఈ టూర్ ప్యాకేజీ ధర అయితే పెద్దలకు రూ.1850. పిల్లలకు రూ.1490 గా వుంది. వేములవాడకు ఒక రోజు టూర్ ప్యాకేజీ ని తీసుకొచ్చింది. ఉదయం 7 గంటలకు హైదరాబాద్‌లో స్టార్ట్ అయితే కొమురవెల్లి మల్లికార్జున స్వామి ఆలయాన్ని చూసి వేములవాడ బయల్దేరాలి. వేములవాడ రాజరాజేశ్వర స్వామి ఆలయాన్ని సందర్శించిన తర్వాత కొండగట్టు బయల్దేరాలి. కొండగట్టు ఆంజనేయ స్వామి ఆలయం అయ్యాక మళ్ళీ ప్రయాణం రాత్రి 8 గంటలకు హైదరాబాద్ చేరుకుంటారు. ఇదైతే పెద్దలకు రూ.1200. పిల్లలకు రూ.960.

Read more RELATED
Recommended to you

Exit mobile version