కరోనా వైరస్ ని ఆపలేక చైనా చేతులు ఎత్తేసిందా…? అంటే అవుననే సమాధానం వినపడుతుంది. చైనాలో ఈ వైరస్ తీవ్రత అసలు అంచనా వేయలేని స్థాయిలో ఉందని అంటున్నారు. ఇప్పుడు చైనాను అంతర్జాతీయ సమాజం దోషిగా చూస్తుంది. ఆ దేశంలో ఇప్పటి వరకు 25 వేల మందికి పైగా కరోనా బారిన పడగా దాదాపు వెయ్యి మంది ప్రాణాలు కోల్పోయారని కొందరు అంటున్నారు. కాని చైనా నిజాలు దాచేస్తుందని అంటున్నారు.
చైనా ఇప్పుడు ఊహించని విధంగా ప్రాణ నష్టం ఎదుర్కొనే అవకాశం ఉందని కూడా నిపుణులు చెప్తున్నారు. అంతర్జాతీయంగా ఆ దేశ౦ ఇప్పుడు కొన్ని చర్యలతో అభాసుపాలు అయింది. వ్యాధి సోకిన 20 రోజుల తర్వాత అంతర్జాతీయ సమాజానికి చెప్పడంతోనే విదేశాలకు కూడా కరోనా సోకింది. అసలు అక్కడి పౌరులను కూడా ఆ దేశం అప్రమత్తం చేయలేకపోయింది. దీనితో భారీగా ప్రాణ నష్టం ఉండే అవకాశం ఉందని అంటున్నారు.
ఇప్పటి వరకు అసలు అనధికారిక లెక్కల ప్రకారం చైనాలో కరోనా వైరస్ బాధితుల సంఖ్య 60 వేల వరకు ఉంది అనేది కొందరి మాట. జనం పిట్టల్లా రాలిపోతున్నారని అంటున్నారు. దీనితో ఇప్పుడు చైనా సర్కార్ చేతులు ఎత్తేసింది అంటున్నారు. అసలు ఇప్పుడు ఆ వ్యాధిని అదుపు చేయడానికి చైనా వద్ద ఏ మార్గం లేదని, అటు ఆస్పత్రులు కూడా సరిపోయే అవకాశం లేదని, వ్యాధి అంతకంతకు పెరగడంతో చైనా కుప్పకూలిపోయే అవకాశం ఉందని అంటున్నారు.