తెలంగాణ ప్రభుత్వం నిరుద్యోగులకు మరో గుడ్ న్యూస్ ను చెప్పింది.రాష్ట్ర ప్రభుత్వానికి చెందిన తెలంగాణ వైద్య విధాన పరిషత్, హైదరాబాద్ జిల్లా ప్రభుత్వ ఆసుపత్రుల్లో ఒప్పంద ప్రాతిపదికన సీఏఎస్ స్పెషలిస్టు పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్ధుల నుంచి దరఖాస్తులు కోరుతోంది. నోటిఫికేషన్‌కు సంబంధించి దరఖాస్తులు, ఖాళీల వివరాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం..
మొత్తం ఖాళీలు..50
పోస్టుల వివరాలు: గైనకాలజీ, రేడియాలజీ, అనస్థీషియా, పీడియాట్రిక్స్, జనరల్ మెడిసిన్, ఆర్థోపెడిక్స్, జనరల్ సర్జరీ, జీడీఎంవో పోస్టులు
వయస్సు: అభ్యర్ధుల వయసు 34 ఏళ్లకు మించరాదు.
అర్హతలు: పోస్టును బట్టి సంబంధిత స్పెషలైజేషన్‌లో డిప్లొమా, డిగ్రీ, డీఎన్‌బీ లేదా తత్సమాన కోర్సులోఉత్తీర్ణత సాధించి ఉండాలి. అలాగే సంబంధిత పనిలో అనుభవం కూడా ఉండాలి.
ఎంపిక విధానం: అకడమిక్ మెరిట్, అనుభవం, రిజర్వేషన్ ఆధారంగా అభ్యర్ధులను ఎంపిక చేస్తారు.
దరఖాస్తు విధానం: ఆసక్తి కలిగిన అభ్యర్ధులు ఆఫ్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.
అడ్రస్: Programme Officer (HS&I), Hyderabad at 4th floor, Community Health center Khairathabad, Opposite to “Khairathabad Ganesh pandal” Khairathabad, Hyderabad.
దరఖాస్తులకు చివరి తేదీ: జూన్ 27, 2022
ఆసక్తి కలిగిన వాళ్ళు ఈ ఉద్యొగాలకు సంభందించిన వివరాలను ఒకసారి నోటిఫికేషన్ లో చదివి అప్లై చేసుగలరు..