అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌తోపాటు భారత పర్యటనకు వచ్చిన ఆయన సతీమణి, అమెరికా ప్రథమ మహిళ మెలానియా ట్రంప్ ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. స్వతహాగా ఫ్యాషన్ డిజైనర్ కూడా అయిన మెలానియా వేషధారణ.. అందిరి చూపులూ ఆమెపైనే ఉండేలా చేసింది. తెల్లటి డ్రెస్‌పై బంగారు జరితో కూడిన ఆకుపచ్చ శాష్‌ను బెల్ట్‌లా కట్టుకుని మిలామిలా మెరిసిపోయింది మెలానియా. మరి మెలానియా ధరించిన దుస్తుల్లో స్పెషల్ అట్రాక్షన్‌గా కనిపించిన శాష్‌ను భారత టెక్స్‌టైల్స్‌ను ఉపయోగించే తయారు చేశారట తెలుసా!
మెలానియా ట్రంప్ సోమవారం మధ్యాహ్నం అహ్మదాబాద్ ఎయిర్‌పోర్టులో విమానం నుంచి బయటకు వస్తూనే తెల్లని దుస్తుల్లో దర్శనమిచ్చారు. ఫుల్‌హ్యాడ్స్‌తో ఉన్న తెల్లని డ్రెస్ వేసుకుని.. ఆకుపచ్చ, బంగారు వర్ణం కలబోతతో ఉన్న శాష్‌ను నడుముకు కట్టుకున్నారు. ఈ వస్త్రధారణ మెలానియాకు బ్యూటీఫుల్ లుక్‌ను తెచ్చిపెట్టింది. అహ్మదాబాద్‌లో అడుగపెట్టింది మొదలు ఆగ్రాలో తాజ్‌మహల్‌కు చేరుకునే వరకు అదే డ్రెస్ వేసుకున్నారు మెలానియా. మరోవైపు ట్రంప్ కూడా నలుపురంగు సూట్ మీద పసుపు రంగు టై ధరించి అదరగొట్టారు.
అయితే, మెలానియా ట్రంప్ నడుముకు కట్టుకున్న బంగారు జరి కలిగిన ఆకుపచ్చ శాష్.. ఇండియన్ టెక్స్‌టైల్స్‌తో తయారు చేసిందని తెలిసి అందరిలో చర్చనీయాంశంగా మారింది. ఆ శాష్ ఇండియన్ టెక్స్‌టైల్స్‌తో తయారుచేసిందేనన్న విషయాన్ని మెలానియా డ్రెస్‌ను డిజైన్ చేసిన హెర్వ్ పియర్ ఇన్‌స్ట్రాగ్రామ్‌లో పోస్ట్ చేశాడు. దీంతో అందరూ మెలానియా శాష్ గురించే ఆసక్తిగా మాట్లాడుకున్నారు.