క్రికెట్ ఫ్యాన్స్‌కు గుడ్ న్యూస్.. స్టేడియంలోకి ప్రేక్షకుల‌కు అనుమ‌తి

-

క్రికెట్ అభిమానుల‌కు బీసీసీఐ గుడ్ న్యూస్ చెప్పింది. ఇండియా, వెస్టిండీస్ మ‌ధ్య జ‌రుగుతున్న టీ 20 సిరీస్ లోని మూడో టీ 20 నుంచి స్టేడియంలోకి ప్రేక్షకుల‌ను అనుమ‌తి ఇస్తున్న‌ట్టు బీసీసీఐ ప్ర‌క‌టించింది. కాగ క‌రోనా వైరస్ తో పాటు ఓమిక్రాన్ వేరియంట్లు దేశంపై దాడి చేయ‌డంతో థ‌ర్డ్ వేవ్ వ‌చ్చింది. దీంతో క్రికెట్ స్టేడియాల్లోకి ప్రేక్షకుల ఎంట్రిపై బీసీసీఐ ఆంక్షలు విధించింది. దీంతో దేశంలో ఇప్ప‌టి వ‌ర‌కు జ‌రిగిన మ్యాచ్ ల‌ను ప్రేక్షకులు లేకుండానే బీసీసీఐ నిర్వ‌హించింది.

అంతే కాకుండా ఆట‌గాళ్లు క‌ఠిన‌మైన బ‌యో బ‌బుల్ ను కూడా ఏర్పాటు చేసింది. కాగ ప్ర‌స్తుతం దేశంలో క‌రోనా వైర‌స్ వ్యాప్తి త‌గ్గింది. థ‌ర్డ్ వేవ్ కూడా దాదాపు ముగిసింది. దీంతో బీసీసీఐ కీలక నిర్ణ‌యం తీసుకుంది. క్రికెట్ మ్యాచ్ ల వీక్షణ‌కు ప్రేక్షకుల‌ను అనుమ‌తించాల‌ని నిర్ణ‌యం తీసుకుంది. ప్ర‌స్తుతం టీమిండియాతో వెస్టిండీస్ టీ 20 సిరీస్ జ‌రుగుతున్న విషయం తెలిసిందే. కాగ ఈ సిరీస్ లో మూడో టీ 20 ఈ నెల 20 జ‌ర‌గ‌నుంది. ఈ మ్యాచ్ కు ప్రేక్షకుల‌ను అనుమ‌తించాల‌ని బీసీసీఐ భావించింది.

కాగ ఈ మ్యాచ్ కు ప్రేక్షకుల‌ను అనుమ‌తి ఇస్తే.. రాబోయే ఐపీఎల్ కూడా ప్రేక్షకుల స‌మ‌క్షంలోనే జ‌ర‌గ‌బోతుంద‌ని అంచ‌నా వేస్తున్నారు. అయితే ఐపీఎల్ కు ప్రేక్షకుల అనుమ‌తిపై బీసీసీఐ ఇప్ప‌టి వ‌ర‌కు నిర్ణ‌యం తీసుకోలేదు.

Read more RELATED
Recommended to you

Exit mobile version