చంద్రబాబు మళ్లీ సీఎం కాలేరు..- మంత్రి కోడాలి నాని

-

చంద్రబాబు, ఆయనకి తోకలుగా ఉన్న పార్టీలు, ఆయన్ని సీఎంను చేయాలని తపించే పత్రికలకు నిద్ర పట్టడం లేదని వైస్సార్సీపీ నేత, మంత్రి కొడాలి నాని విమర్శించారు. చంద్రబాబు మళ్లీ సీఎం కాలేరని మంత్రి కొడాలి అన్నారు. చంద్రబాబును ముఖ్యమంత్రిని చేయడం మీ తరం కాదని అన్నారు. పేదల కోసం పనిచేసే ముఖ్యమంత్రిపై ఇన్ని అబద్ధాలు ప్రచారం చేస్తున్నారని విమర్శించారు.

విజయవాడలో బెంజ్ సర్కిల్లో ఫ్లైఓవర్ మేము వచ్చాక మంజూరు చేయించి పూర్తి చేశామని…  మొత్తం 51 ప్రాజెక్ట్ లకు ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు చేసింది చంద్రబాబుకు కనిపించడం లేదా అని విమర్శించారు. ఇలాంటివన్నీ చేసీ సీఎం జగన్ బలపడతాడని చంద్రబాబు దొంగ ఏడుపులు ఏడుస్తున్నాడని.. ఆరోపించారు. చంద్రబాబు ఎంతమంది డీజీపీలను, సీఎస్ మార్చారో చెప్పాలని డిమాండ్ చేశారు. గౌతం సవాంగ్ వచ్చి చాాలా కాలం అయిందని.. వేరేవారికి అవకాశం ఇవ్వాలనే డీజీపీని మార్చారని తెలిపారు. గడ్కరీ వస్తున్నారని ఇలాంటి 420 మాటలన్నీ మాట్లాడుతున్నారని విమర్శించారు. నేను మాట్లాడితే టీడీపీ నాయకులు గక్కపట్టి ఏడుస్తారంటూ వ్యాఖ్యానించారు. పదవులు శాశ్వతం కాదని.. చరిత్ర శాశ్వతం అని చంద్రబాబుకు హితవు పలికారు. మీ డబ్బా మీడియాలో తప్పితే.. జగన్ ప్రజల గుండెల్లో ఉంటాడని అన్నారు కోడాలి నాని.

 

 

 

Read more RELATED
Recommended to you

Exit mobile version