మెడికల్‌ కాలేజీల పనులు వేగవంతం చేయాలి : హరీశ్‌రావు

-

వైద్యారోగ్యశాఖ మంత్రి హరీశ్‌రావు రాష్ట్రంలో ఈ సంవత్సరంలో నిర్మిస్తున్న తొమ్మిది మెడికల్‌ కాలేజీలకు సంబంధించిన పనులను త్వరగా చేపట్టాలని అధికారులకు సూచించారు . శనివారం ఎంసీహెచ్‌ఆర్‌డీలో మెడికల్‌ కాలేజీల నిర్మాణ పనులపై సమీక్ష జరిగింది. ఈ నేపథ్యంలో మంత్రి హరీష్ రావు మాట్లాడుతూ, ఇప్పటికే 67 మందికి ఈ మెడికల్‌ కాలేజీలు ప్రారంభించే లక్ష్యంలో భాగంగా ప్రమోషన్లు ఇచ్చినట్లు తెలియచేసారు. 210 మంది అసోసియేట్ ప్రొఫెసర్లకు వారం రోజుల్లో కౌన్సెలింగ్ ద్వారా పోస్టింగ్ ఇవ్వనినట్లు తెలిపారు ఆయన. 1,442 మంది అసిస్టెంట్ ప్రొఫెసర్ల నియామక ప్రక్రియ చివరి దశకు చేరిందని, రెండు మూడు రోజుల్లో ప్రొవిజనల్ మెరిట్ లిస్ట్‌ను కూడా విడుదల చేసి, పది రోజుల్లో తుది నియామక పత్రాలు అందించేలా చర్యలు చేపట్టాలని అన్నారు మంత్రి హరీష్ రావు. కౌన్సెలింగ్‌ నిర్వహించి తొమ్మిది మెడికల్ కాలేజీల్లో వీరిని నియమించాలన్నారు. కాలేజీల విషయంలో సమన్వయం కోసం మంత్రులు ప్రశాంత్ రెడ్డి, గంగుల కమలాకర్, అజయ్ కుమార్, పలు జిల్లా కలెక్టర్లతో మంత్రి మాట్లాడారు. ఈ అన్ని కాలేజీల్లో కూడా వైద్య విద్యార్థులకు హాస్టల్ వసతి కల్పించాలని ఆదేశించారు మంత్రి.

క్లాసులు ప్రారంభమయ్యే వరకు అవసరమైన ఫర్నీచర్, ఎక్విప్మెంట్ సిద్ధం చేయాలని అన్నారు. సీఎం కేసీఆర్ గారి మార్గానిర్దేశనంలో గత సంవత్సరం 8 మెడికల్ కాలేజీలు ఒకేసారి ప్రారంభించి రికార్డు సృష్టించామని తెలిపారు ఆయన. ఇదే స్ఫూర్తితో ఈ ఏడాది కూడా కరీంనగర్, ఖమ్మం, కామారెడ్డి, వికారాబాద్, జనగాం, నిర్మల్, భూపాలపల్లి, సిరిసిల్ల, ఆసిఫాబాద్ జిల్లాల్లో ఎంబీబీఎస్ అకడమిక్ ఇయర్ ప్రారంభమయ్యేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. అన్ని కాలేజీలు నేషనల్ మెడికల్ కమిషన్ నుంచి అనుమతులు పొందేలా సిద్దంగా ఉండాలని సూచించారు మంత్రి హరీష్ రావు.

 

Read more RELATED
Recommended to you

Exit mobile version