Asia Champions Trophy : పాకిస్తాన్ పై భారత్ ఘన విజయం

-

ఆసియా హాకీ ఛాంపియన్స్ ట్రోఫీ 2024 చైనా వేదికగా జరుగుతోంది. ఈ టోర్నమెంట్ లో భారత్  జట్టు సత్తా చాటుతూ.. హాకీలో తమకు తిరుగులేదని నిరూపిస్తోంది. ఈ సీజన్ లో  ఇప్పటికే వరుసగా మూడు మ్యాచుల్లో విజయం సాధించి.. భారత్ సెమీస్ చేరుకున్న విషయం తెలిసిందే.  ఈ రోజు భారత చిరకాల ప్రత్యర్థి అయిన పాకిస్థాన్ జట్టుతో భారత్ నామమాత్రపు మ్యాచ్ ఆడింది. ఈ మ్యాచ్లో 2-1 తేడాతో భారత్ ఘన విజయం సాధించింది.

ఇందులో టీమ్ ఇండియా కెప్టెన్ హర్మన్ ప్రీత్ సింగ్ రెండు గోల్స్ చేసి భారత జట్టు విజయంలో కీలక పాత్ర పోషించారు. ఇదిలా ఉండగా.. భారత్ తో పాటు కొరియా, పాకిస్థాన్ జట్లు సెమీస్ అర్హత సాధించగా.. నాలుగో స్థానం కోసం మలేషియా, చైనా జట్లు పోటీ పడుతున్నాయి. ఈ పొజిషన్  రేపు చైనా-జపాన్ జట్ల మధ్య జరిగే మ్యాచ్ నిర్ణయించనుంది. అయితే సెమీఫైనల్ మ్యాచ్లు ఈ నెల 16 నుంచి జరగనున్నాయి. ఈ సెమీస్ లో ఏయే జట్ల మధ్య మ్యాచులు జరగాలన్నది కూడా రేపు జరిగే చైనా-జపాన్ మ్యాచ్ తోనే తేలనుంది.

Read more RELATED
Recommended to you

Exit mobile version