ASIA CUP 2022: టోర్నీకి అర్హత సాధించిన హంకాంగ్

-

ప్రస్తుతం క్రికెట్ ప్రపంచంలో ఆసియా కప్ ఫీవర్ నడుస్తోంది. ఆగస్టు – సెప్టెంబర్ నెలలు ఆసియాలో క్రికెట్ అభిమానులకు ప్రత్యేకమైనవి. మొత్తం ఆరు జట్లు తెలపడనున్న ఈ మెగా ఈవెంట్ లో టీమిండియా ఫేవరెట్ గా బరిలోకి దిగుతుంది అనడంలో ఎలాంటి సందేహం లేదు. ముఖ్యంగా భారత్ – పాకిస్తాన్ లలోని క్రికెట్ అభిమానులు ఎప్పటినుంచో ఎదురుచూస్తున్న ఆసియా కప్ ప్రారంభం కాబోతోంది. కొత్త కెప్టెన్.. యువ ఆటగాళ్ల రాక నేపథ్యంలో రెట్టించిన ఉత్సాహంతో టోర్నీలో అడుగుపెట్టనుంది టీమిండియా.

ముందుగా శ్రీలంకలో ఆసియా కప్ జరగాల్సి ఉంది. కానీ అక్కడి పరిస్థితుల దృశ్య ఈ టోర్నీని యూఏఈకి మార్చిన సంగతి తెలిసిందే. ఆసియా కప్ ఈనెల 27 నుంచి సెప్టెంబర్ 11 వరకు జరగనుంది. మొత్తం ఆరు చెట్లు ఇందులో పాల్గొంటాయి. ఇందులో ఐదు జట్లు (భారత్, పాకిస్తాన్, శ్రీలంక, ఆఫ్ఘనిస్తాన్, బంగ్లాదేశ్) ఇప్పటికే అర్హత సాధించాయి. ఒక టీం కోసం నాలుగు జట్లు (హాంకాంగ్, కువైట్, సింగపూర్, యూఏఈ) పోటీపడ్డాయి. ఇందులో ఆరవ జట్టుగా హాంకాంగ్ అర్హత సాధించింది.

బుధవారం ఓమన్ వేదికగా యూఏఈ తో జరిగిన ఆఖరి మ్యాచ్లో విజయం సాధించిన హాంకాంగ్ ఆసియా కప్ లో అడుగుపెట్టింది. ఆసియా కప్ క్వాలిఫైయర్స్ లో మూడు మ్యాచ్ లు ఆడిన హాంకాంగ్.. అన్నింటిలోనూ విజయం సాధించి టేబుల్ టాపర్ గా నిలిచింది. తద్వారా ఈ మెగా ఈవెంట్ గ్రూప్ ఏ లో భారత్, పాకిస్తాన్ జట్లతో హాంకాంగ్ చేరింది. హాంకాంగ్ తమ తొలి మ్యాచ్ లో ఆగస్టు 31న దుబాయ్ వేదికగా టీమిండియాతో తలపడనుంది. కాగా ఆసియా కప్ టి20 ఫార్మాట్లో పాల్గొనడం ఇదే తొలిసారి.

అయితే ఈ మ్యాచ్ లో తొలిత బ్యాటింగ్ చేసిన యూఏఈ 19.3 ఓవర్లలో 147 పరుగులకు ఆల్ అవుట్ అయింది. కెప్టెన్ చందన్గపోయిల్ రిజ్వాన్ 49 పరుగులు చేయగా.. జవర్ ఫరీద్ 27 బంతుల్లో రెండు ఫోర్లు, మూడు సిక్సర్లతో 41 పరుగులు చేశాడు. 148 పరుగుల లక్ష్యాన్ని రెండు వికెట్లు కోల్పోయి 19 ఓవర్లలో ఈజీగా చేదించింది హాంకాంగ్.

Read more RELATED
Recommended to you

Exit mobile version