IND VS PAK : ఈ లెక్కలు చూస్తే, పాకిస్తాన్ గజ,గజ వణకాల్సిందే

-

చిరకాల ప్రత్యర్ధులు భారత్, పాకిస్తాన్ మధ్య మ్యాచ్ అంటేనే భావోద్వేగాల సమ్మేళనం! మైదానంలో ఓ యుద్ధంలాంటి వాతావరణం నెలకొంటుంది! ఇరుదేశాల అభిమానులే కాకుండా యావత్ క్రికెట్ ప్రపంచం ఎంతో ఆసక్తికరంగా చూస్తోంది. ఆ పోరుకు ఆసియా కప్ వంటి మెగా టోర్నీ వేదికగా అయితే ఆ అనుభూతి మాటల్లో వర్ణించలేం. అయితే.. నాలుగేళ్ల సుదీర్ఘ విరామం తర్వాత ఆగస్టు 27 నుంచి ఆసియా కప్ ప్రారంభం కానుంది. అయితే ఆగస్టు 28న భారత్ – పాకిస్తాన్ జట్ల మధ్య జరగనున్న మ్యాచ్ పైనే క్రికెట్ ప్రేమికుల కళ్ళు నిలిచాయి. ఆసియా కప్ పాత రికార్డును పరిశీలిస్తే, పాకిస్తాన్ జట్టుపై భారత్ పైచేయి భారీగా కనిపిస్తోంది.

ఇప్పటివరకు ఆసియా కప్ లో భారత్, పాకిస్తాన్ జట్లు 14 సార్లు తలపడ్డాయి. ఆసియా కప్ లో భారత జట్టు పాకిస్తాన్ ను ఎనిమిది సార్లు ఓడించింది. అదే సమయంలో పాకిస్తాన్ జట్టు ఇప్పటివరకు కేవలం ఐదు మ్యాచ్ లు మాత్రమే గెలిచింది. 1997లో ఇరు జట్ల మధ్య జరిగిన మ్యాచ్ ఫలితం ఇవ్వలేదు. గతేడాది టి20 ప్రపంచ కప్ తర్వాత తొలిసారిగా భారత్, పాకిస్తాన్ జట్లు తలపడనున్నాయి. గత ఏడాది తొలిసారిగా ప్రపంచ కప్ లో భారత్ ను ఓడించి, పాకిస్తాన్ జట్టు విజయం సాధించింది. ప్రపంచ కప్ లో పాక్ ఓటమికి ప్రతీకారం తీర్చుకోవాలని ప్రస్తుతం టీమిండియా ఉవ్విల్లురుతోంది.

టీ20 ఫార్మాట్ లో భారత్, పాకిస్తాన్ జట్లు చాలా పటిష్టంగా కనిపిస్తున్నాయి. టీం ఇండియాలో రోహిత్ శర్మ, కేఎల్ రాహుల్, విరాట్ కోహ్లీ, రిషబ్ పంత్, సూర్య కుమార్ లాంటి బ్యాట్స్ మెన్ ఉన్నారు. అదే సమయంలో పాకిస్తాన్ లో బాబర్ అజం, ఫకర్ జమాన్, మహమ్మద్ రిజ్వాన్ కూడా ఉన్నారు. బాబర్ రిజ్వాన్ ప్రస్తుతం టి20 క్రికెట్లో అత్యుత్తమ జోడిల్లో ఒకటిగా నిలిచారు. అయితే ఆసియా కప్ లో ఇరుజట్లు తమ ప్రధాన ఫాస్ట్ బౌలర్ లేకుండానే రంగంలోకి దిగాల్సి ఉంటుంది. వెన్నునొప్పి సమస్య కారణంగా జస్ప్రీత్ బూమ్రా ఆసియా కప్ లో భాగం కాలేకపోయాడు. మరోవైపు, షాహిన్ షా ఆఫ్రిది మోకాలి గాయంతో ఇబ్బంది పడుతుండగా, అతను ఈసారి ఆసియా కప్ లో జట్టులో భాగం కావడం లేదని పాకిస్తాన్ క్రికెట్ బోర్డు ప్రకటించింది.

Read more RELATED
Recommended to you

Exit mobile version