ఆసియా కప్-2022 కు పాకిస్తాన్ యువ పెసర్ మహమ్మద్ వసీమ్ వెన్ను నొప్పితో దూరమైన సంగతి తెలిసిందే. అయితే తాజాగా వసీమ్ స్థానంలో ఆ జట్టు సీనియర్ పెసర్ హాసన్ ఆలీని పాకిస్తాన్ క్రికెట్ బోర్డు ఎంపిక చేసింది. కాగా ప్రాక్టీస్ సెషన్ లో భాగంగా బౌలింగ్ చేస్తున్న సమయంలో మహమ్మద్ వసీమ్ వెన్ను నొప్పితో బాధపడ్డాడు.
అతడినీ వెంటనే ఐసీసీ అకాడమీ తరలించి, ఎంఆర్ఐ స్కాన్ చేయించగా గాయం తీవ్రమైనది గానే తేలింది. ఈ క్రమంలో వసీమ్ టోర్నీ మొత్తానికి దూరం అయ్యాడు. అంతకుముందు పాక్ స్టార్ పెసర్ షాహిన్ ఆఫ్రిది మోకాలి గాయంతో ఈ మెగా టోర్నీకి దూరమయ్యాడు. ఇప్పటికే అతడి స్థానాన్ని యువసేన మొహమ్మద్ హస్నైన్ తో పాక్ భర్తీ చేసింది.
ఇక ఎక్స్ప్రెస్ పెసర్ హాసన్ అలీ గత కొంతకాలంగా ఫామ్ కోల్పోయి తీవ్ర ఇబ్బంది పడుతున్నాడు. ఈ క్రమంలో పిసిబి జట్టు నుంచి హసన్ ఉద్వాసన పలికింది. ఇటీవల నెదర్లాండ్స్ తో జరిగిన వన్డే సిరీస్ కు కూడా అతడిని పిసిబి సెలెక్టర్లు ఎంపిక చేయలేదు. ఇక అనూహ్యంగా జట్టులోకి వచ్చిన హసన్ ఏ మేరకు రాణిస్తాడో చూడాలి మరి.