నష్టాల నుంచి బయటపడటానికి భారత్ ని బ్రతిమిలాడుతున్న ఆసిస్…!

-

కరోనా వైరస్ దెబ్బకు ఇప్పుడు ప్రపంచ దేశాలు అన్నీ కూడా ఎన్నో విధాలుగా నష్టపోతున్నాయి. క్రికెట్ కూడా భారీగా నష్టపోయింది. ఒక్క మ్యాచ్ అంటే ఒక్క మ్యాచ్ కూడా జరిగే పరిస్థితి ప్రపంచ వ్యాప్తంగా ఎక్కడా లేదు. దీనితో క్రికెట్ కి ఆతిధ్యం, ప్రాధాన్యత ఇచ్చే దేశాలు అన్నీ కూడా నష్టపోయే పరిస్థితిలో ఉన్నాయి. దీనితో ఇప్పుడు కరోనా తగ్గిన తర్వాత ఎక్కువ మ్యాచ్ లు ఆడటానికి ప్రయత్నాలు చేస్తున్నాయి.

ఈ నేపధ్యంలోనే క్రికెట్ ఆస్ట్రేలియా మన దేశాన్ని బ్రతిమిలాడుతుంది. ప్రస్తుతం అందుతున్న సమాచారం ప్రకారం… పోయిన ఆదాయాన్ని సమకూర్చుకోవడానికి గానూ అన్ని మార్గాలను అన్వేషిస్తున్నారు. ఈ నేపధ్యంలోనే కరోనా తగ్గిన వెంటనే ఇండియా ఆసిస్ జట్ల మధ్య ఐదు టెస్టుల సిరీస్ వచ్చే అవకాశం ఉంది. ఇండియాకు డిసెంబర్ మరియు జనవరి నెలల్లో ఆతిథ్యం ఇవ్వడానికి అన్ని అవకాశాలను పరిశీలిస్తామని ఆసిస్ పేర్కొంది.

క్రికెట్ ఆస్ట్రేలియా చీఫ్ ఎగ్జిక్యూటివ్ కెవిన్ రాబర్ట్స్ దీనిపై ప్రకటన చేసారు. అక్టోబర్ 18 నుంచి నవంబర్ 15 వరకు జరగనున్న ట్వంటీ 20 ప్రపంచ కప్‌ వాయిదా పడే అవకాశం ఉంది. ఇది కూడా ఆసిస్ లోనే జరుగుతుంది. ఇది జరగకపోయినా పర్వాలేదు గాని భారత్ తో ఒక సీరీస్ ఆడాలని ఆ దేశం చూస్తుంది. ఇప్పటికే శ్రీలంక కూడా మనల్ని అడిగినట్టు సమాచారం. ఈ ఏడాది చివర్లో ఎలాగూ ఇండియా ఆసిస్ జట్ల మధ్య 3 మ్యాచుల సీరీస్ జరగనుంది.

Read more RELATED
Recommended to you

Exit mobile version