IND vs AUS : అడిలైడ్‌లో ఆట ముగిసే సమయానికి ఆస్ట్రేలియా స్కోరు ఎంతంటే..?

-

ఆస్ట్రేలియాలోని అడిలైడ్‌ లో భారత్- ఆస్ట్రేలియా మధ్య రెండో టెస్టు మ్యాచ్ జరుగుతున్న విషయం తెలిసిందే. పింక్ బాల్ తో జరిగిన ఈ మ్యాచ్ లో తొలుత టాస్ గెలిచిన టీమిండియా జట్టు బ్యాటింగ్ ఎంచుకుంది. తొలి ఇన్నింగ్స్ భారత్ 180 పరుగులు చేసి ఆలౌట్ అయింది. అందులో తెలుగు క్రికెటర్ నితీశ్ కుమార్ రెడ్డి టాప్ స్కోరర్ గా నిలవడం విశేషం.

తొలి ఇన్నింగ్స్ లో ఆస్ట్రేలియా బ్యాటర్లు నిలకడగా ఆడుతున్నారు. ఆసీస్ జట్టు 24 పరుగుల వద్ద తొలి వికెట్ ను కోల్పోయింది. ఉస్మాన్ ఖవాజా35 బంతుల్లో 13 పరుగులు చేసి బుమ్రా బౌలింగ్ కెప్టెన్ రోహిత్ కి క్యాచ్ ఇచ్చాడు. భారత బౌలర్లు కట్టుదిట్టంగా బౌలింగ్ చేస్తున్నారు. అలాగే ఆసీస్ బ్యాటర్లు కూడా ఆచితూచి ఆడుతున్నారు. ప్రస్తుతం ఆసీస్ బ్యాటర్లు మెక్ స్వినీ 80 బంతుల్లో 31 పరుగులు చేయగా.. లబు షేన్ 47 బంతుల్లో 17 పరుగులు చేసి క్రీజులో పాతుకుపోయారు. తొలి రోజు ఆట ముగిసే సమయానికి ఆస్ట్రేలియా 86/1 పరుగులు చేసింది.  రేపు భారత బౌలర్లు ఎలా బౌలింగ్ చేస్తారో చూడాలి మరీ.

Read more RELATED
Recommended to you

Latest news