తెలంగాణలోని డాక్టర్ బీ.ఆర్. అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ వీసీగా TSPSC మాజీ చైర్మన్ ఘంటా చక్రపాణి నియమితులయ్యారు. ఈ మేరకు ప్రభుత్వం ఉత్తర్వులను జారీ చేసింది. ఇటీవలే TGPSC చైర్మన్ గా బుర్రా వెంకటేశంను ప్రభుత్వం నియమించిన విషయం తెలిసిందే. అయితే అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ వైస్ ఛాన్స్ లర్ గా ప్రొఫెసర్ ఘంటా చక్రపాణి మూడేళ్ల పాటు కొనసాగనున్నారు.
గతంలో అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీలో ఆయన సోషియాలజీ డిపార్ట్ మెంట్ ప్రొఫెసర్ గా చక్రపాణి విధులను నిర్వర్తించారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తరువాత TSPSC తొలి చైర్మన్ గా ఘంటా చక్రపాణి సేవలందించారు.