రవీంద్ర జడేజాను టీమిండియా నుంచి తీసేయండి – ఇర్ఫాన్ పఠాన్

-

మాజీ ఆల్ రౌండర్ ఇర్ఫాన్ పఠాన్ సంచలన వ్యాఖ్యలు చేశారు. టీ20 ప్రపంచ కప్ 2024లో టీమిండియా విజయం సాధించాలంటే తుది జట్టులో కీలక మార్పు చేయాలని మాజీ ఆల్ రౌండర్ ఇర్ఫాన్ పఠాన్ సూచించారు. రవీంద్ర జడేజా స్థానంలో అక్షర పటేల్ ను ఆడించాలని చెబుతున్నారు. జడేజా కంటే అక్షర పటేల్ తోనే జట్టుకు మంచి సమతూకం రావడంతో పాటు స్థిరత్వం కూడా వస్తుందని చెప్పాడు. పాకిస్తాన్ తో జరిగిన మ్యాచ్ లో అక్షర్ పటేల్ కు బ్యాటింగ్ ప్రమోషన్ ఇవ్వగా….అతను విలువైన ఇన్నింగ్స్ ను ఆడాడు.

బౌలింగ్ లోను జట్టుకు కావాల్సినప్పుడల్లా వికెట్లు తీశాడు. జడేజా కంటే అక్షర్ పటేల్ మెరుగైన ప్రదర్శన చేశాడు. గత మూడు మ్యాచుల్లో 13 సగటుతో అక్షర్ పటేల్ మూడు వికెట్లు తీశాడు. అతని బౌలింగ్ ఎకానమీ 6.50. పాకిస్తాన్ తో జరిగిన మ్యాచులో నాలుగో స్థానంలో బ్యాటింగ్ కు వచ్చిన అక్షర పటేల్ 18 బంతుల్లో 20 పరుగులు చేశాడు. మరోవైపు జడేజా గోల్డెన్ డక్ గా వెనిదిరిగాడు. బౌలింగ్ లోన్ జడేజా విఫలమయ్యాడు. మూడు మ్యాచుల్లో ఒక్క వికెట్ కూడా తీయలేదు. ఈ క్రమంలోనే అక్షర్ పటేల్ పై ఇర్ఫాన్ ప్రశంసల జల్లు కురిపించాడు.

Read more RELATED
Recommended to you

Latest news