జార్ఖండ్‌లో భారీ ఎన్‌కౌంటర్‌.. నలుగురు మావోయిస్టులు మృతి

-

జార్ఖండ్‌లోని చైబాసాలో నలుగురు నక్సల్స్‌ మృతి చెందగా, మరో ఇద్దరిని భద్రతా బలగాలు అరెస్టు చేసినట్లు పోలీసులు సోమవారం తెలిపారు. హతమైన నలుగురు నక్సల్స్‌లో జోనల్ కమాండర్, సబ్ జోనల్ కమాండర్, ఏరియా కమాండర్ కూడా ఉన్నారు.అరెస్టయిన ఇద్దరు నక్సల్స్‌లో ఏరియా కమాండర్ కూడా ఉన్నారు. వివిధ రకాలైన రైఫిళ్లను కూడా పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.

4 Maoists Killed In Encounter With Police In West Singhbhum In Jharkhand

కాగా. జార్ఖండ్ లోని వెస్ట్ సింగ్ భూమ్ జిల్లాలోని అటవీ ప్రాంతంలో భద్రత బలగాలు, నక్సలైట్లకు మధ్య ఎదురుకాల్పులు జరిగాయి. నలుగురు నక్సలైట్లు ఎన్కౌంటర్ లో చనిపోయారు. మృతదేహాలను తరలించి వారి వద్ద ఉన్న ఆయుధ సామాగ్రిని స్వాధీనం చేసుకున్నట్లు అధికారులు తెలిపారు. కాగా గత శనివారం చత్తీస్గఢ్ లోని నారాయణపూర్ జిల్లాలో జరిగిన ఎన్కౌంటర్ లో ఎనిమిది మంది నక్సలైట్లు మృతి చెందిన సంగతి తెలిసిందే.

Read more RELATED
Recommended to you

Latest news