BJP: తెలంగాణ గవర్నర్ గా కిరణ్ కుమార్ రెడ్డి..?

-

Kiran Kumar Reddy as Governor of Telangana: రెండు తెలుగు రాష్ట్రాల్లో రాజకీయాలు చాలా హీటేక్కాయి. ఏపీలో వైసీపీ, తెలంగాణ గులాబీ పార్టీలు ప్రభుత్వాలను కోల్పోయాయి. దీంతో… ఏపీ, తెలంగాణలో బీజేపీ పార్టీ ఫుల్‌ జోష్‌ లో కనిపిస్తోంది. అయితే ఇలాంటి నేపథ్యంలోనే.. బీజేపీ పార్టీ నేతలకు కీలక పదవులు ఇచ్చేందుకు మోడీ సర్కార్‌ సిద్ధం అవుతోంది.

Kiran Kumar Reddy as Governor of Telangana

ఇందులో భాగంగానే…ఏపీ బీజేపీ నేత కిరణ్ కుమార్ రెడ్డిని తెలం గాణ గవర్నర్ గా నియమించాలని బీజేపీ అధినాయకత్వం భావిస్తోందన్న చర్చ సంచలనంగా మారిం ది. ఈ ఎన్నికల్లో రాజంపేట బీజేపీ ఎంపీ అభ్యర్థిగా పోటీ చేసిన ఆయన ఓటమి పాలయ్యారు. ఉమ్మడి రాష్ట్ర రాజకీయాలపై మంచి పట్టు ఉన్న నేత కిరణ్ కుమార్ రెడ్డి కావడంతో అతని సేవలను వేరే విధంగా వినియోగించుకోవాలని బీజేపీ పెద్దలు భావిస్తున్నట్లు టాక్ నడుస్తోంది.

Read more RELATED
Recommended to you

Latest news