Ayush Badoni: లక్నో వర్సెస్ ముంబై ఇండియన్స్ మ్యాచ్ లో లక్నో ప్లేయర్ బదోని రన్ అవుట్ పై సోషల్ మీడియాలో వివాదం కొనసాగుతోంది. క్రేజ్ లోకి వచ్చాక కూడా థర్డ్ ఎంపైర్ అవుట్ ఇచ్చారని కొందరు కామెంట్స్ చేస్తున్నారు. మరి కొందరేమో బ్యాట్ గాల్లో ఉండటంతో అవుట్ ఇచ్చారని చెబుతున్నారు.
ఏదేమైనా ఎంపైర్లు ఎప్పుడూ ముంబై ఇండియన్స్ జట్టుకు అనుకూలంగా వ్యవహరిస్తున్నారని ఈ సోషల్ మీడియాలో ట్రోలింగ్ జరుగుతోంది. కాగా ఐపీఎల్ 2024 టోర్నమెంటులో భాగంగా… నిన్న ముంబై ఇండియన్స్ వర్సెస్ లక్నో మధ్య మ్యాచ్ జరిగిన సంగతి తెలిసిందే.
ఈ మ్యాచ్ లో ముంబై ఇండియన్స్ పై నాలుగు టికెట్లు తేడాతో విజయం సాధించింది లక్నో సూపర్ జెంట్స్. ఈ మ్యాచ్ లో మొదటి బ్యాటింగ్ చేసిన ముంబై ఇండియన్స్ నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్లు నష్టపోయి 144 పరుగులు మాత్రమే చేసింది. బ్యాటర్లందరూ దారుణంగా విఫలం కావడంతో ఈ పరిస్థితి నెలకొంది. ఇక అనంతరం బ్యాటింగ్కు దిగిన లక్నో సూపర్ జెంట్స్ ఆడుతూ పాడుతూ లక్ష్యాన్ని చేదించింది.