IND VS AUS : చెవిరెడ్డి కొడుకుకు BCCI అరుదైన గౌరవం

-

IND VS AUS : చెవిరెడ్డి కొడుకుకు BCCI అరుదైన గౌరవం దక్కింది. బిసిసిఐ నుంచి ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి తనయుడు చెవిరెడ్డి హర్షిత్ రెడ్డి కి అరుదైన గౌరవం దక్కింది. చెన్నైలో జరగనున్న ఇండియా, ఆస్ట్రేలియా మూడో వన్డే కు అబ్జర్వర్ గా చెవిరెడ్డి హర్షిత్ రెడ్డి నియమితులయ్యారు. ఈ మేరకు బీసీసీఐ అధికారిక ప్రకటన చేసింది.

ఈ ప్రకటనతో.. చెవిరెడ్డి హర్షిత్ రెడ్డి హర్షం వ్యక్తం చేశారు. కాగా.. ఇండియా, ఆస్ట్రేలియా జట్ల మధ్య వైజాగ్‌ లో జరిగిన రెండో వన్డేలో టీమిండియా ఘోర ఓటమి పాలైంది. ఈ మ్యాచ్‌ లో 10 వికెట్ల తేడాతో టీమిండియా ఓటమి పాలైంది. దీంతో… 1-1 తేడాతో సిరీస్‌ సమం అయింది. ఇక ఇండియా, ఆస్ట్రేలియా మూడో వన్డే చెన్నై వేదికగా జరిగింది. ఇందులో ఏ జట్లు గెలిస్తే.. ఆ టీం సిరీస్‌ ను ఎగురవేసుకుపోనుంది.

 

Read more RELATED
Recommended to you

Exit mobile version