టెస్ట్ లకు విరాట్ కోహ్లీ రిటైర్మెంట్ ప్రకటిస్తాడని ఇవాళ ఉదయం నుంచి వార్తలు వినిపిస్తున్న విషయం తెలిసిందే. అయితే ఇటీవలే రోహిత్ శర్మ రిటైర్మెంట్ ప్రకటించడంతో తాను కూడా రిటైర్మెంట్ ఇవ్వాలని విరాట్ కోహ్లీ ఓ నిర్ణయానికి వచ్చినట్టు సమాచారం. ఈ మేరకు భారత క్రికెట్ నియంత్రణ మండలికీ కూడా సమాచారం ఇచ్చాడు విరాట్ కోహ్లీ. తాజాగా భారత క్రికెట్ నియంత్రణ మండలికి సంబంధించిన అధికారి స్పందించారు. టెస్ట్ రిటైర్మెంట్ పై విరట్ కోహ్లీ సమాచారం ఇచ్చాడని పేర్కొన్నారు.
దీనిపై బీసీసీఐ పాలక మండలి భిన్నంగా ఆలోచిస్తుందని.. విరాట్ కోహ్లీ మంచి ఆటగాడు.. ఫిట్ నెట్ కూడా బాగుంది. రెండేళ్ల పాటు టెస్ట్ క్రికెట్ సత్తా కోహ్లీలో ఉంది అని వ్యాఖ్యానించాడు. ఈ రిటైర్మెంట్ విషయంలో విరాట్ కోహ్లీ తో బీసీసీఐ చర్చిస్తుందని తెలిపాడు. అతని నిర్ణయాన్ని మార్చుకునేలా చర్చలు జరుపుతున్నట్టు వివరించాడు. దీనిపై విరాట్ కోహ్లీ ఎలా రియాక్ట్ అవుతాడో చూడాలి మరీ.