వీడియో: పాకిస్థాన్ కెప్టెన్ సర్ఫరాజ్ కు బుర్ర లేదు: షోయెబ్ అక్తర్

-

కెప్టెన్ సర్ఫరాజ్ తెలివితక్కువ పని చేశాడు. తెలివి తక్కువ నిర్ణయం తీసుకున్నాడు. మనం చేజింగ్ లో బలహీనం అనే విషయం తెలియదా.. అని అక్తర్ అన్నాడు. మన బలమే బౌలింగ్.. బ్యాటింగ్ కాదు.

పాకిస్థాన్ కెప్టెన్ సర్ఫరాజ్ అహ్మద్ కు బుర్ర లేదు. చెత్త మేనేజ్ మెంట్.. అంటూ పాకిస్థాన్ క్రికెటర్లే తిడుతున్నారు. ఎందుకో మీకు ఇప్పటికే అర్థమయిపోయి ఉంటుంది. అవును.. పాకిస్థాన్ కెప్టెన్ సర్ఫరాజ్.. నిన్న జరిగిన భారత్, పాక్ వరల్డ్ కప్ మ్యాచ్ లో టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్నాడు. అదే ఆయన చెప్పిన పెద్ద తప్పా? టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకోక.. బౌలింగ్ ఎంచుకుంటావా? అంటూ సర్ఫరాజ్ పై తీవ్ర విమర్శలు వస్తున్నాయి.

వేరే ఎవరో ఆయనపై విమర్శలు చేయడం లేదు.. పాకిస్థాన్ క్రికెటర్లు, మాజీ క్రికెటర్లు ఆయనపై విరుచుకుపడుతున్నారు. దుమ్మెత్తిపోస్తున్నారు. ఆయనకు బుర్ర లేదంటూ పాకిస్థాన్ మాజీ ఫాస్ట్ బౌలర్ షోయెబ్ అక్తర్ విమర్శించాడు.

కెప్టెన్ సర్ఫరాజ్ తెలివితక్కువ పని చేశాడు. తెలివి తక్కువ నిర్ణయం తీసుకున్నాడు. మనం చేజింగ్ లో బలహీనం అనే విషయం తెలియదా.. అని అక్తర్ అన్నాడు. మన బలమే బౌలింగ్.. బ్యాటింగ్ కాదు. ఈ విషయం తెలిసి కూడా సర్ఫరాజ్ బౌలింగ్ ఎంచుకోవడం ఏంటంటూ మండిపడ్డాడు. పాక్ బ్యాటింగ్ ఎంచుకొని ఉంటే ఆట మరోవిధంగా ఉండేదన్నాడు.

సర్ఫరాజ్ ఎందుకో… ఈ మ్యాచ్ ను పాక్ గెలవకూడదనుకున్నాడో ఏమో… అందుకే… బౌలింగ్ ఎంచుకున్నాడు. టాస్ గెలిచిన టీమ్ సగం గెలిచినట్టే.. అనే విషయం మరిచిపోయి… తొందరపాటు నిర్ణయం తీసుకొని పాకిస్థాన్ పరువును గంగలో కలిపాడంటూ అక్తర్ తెలిపాడు. తన యూట్యూబ్ చానెల్ లో మాట్లాడుతూ… షోయెబ్ పాక్ కెప్టెన్ పై తీవ్ర విమర్శలు చేశాడు.

Read more RELATED
Recommended to you

Exit mobile version