ipl 2023 : SRH కోచ్ గా విండీస్ ప్లేయర్ !

-

సన్ రైజర్స్ హైదరాబాద్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ కావ్య మారన్ సంచలన నిర్ణయాన్ని తీసుకున్నారు. ఐపీఎల్ 2023 సీజన్ వేడిని ఇప్పుడే రాజేశారు. ఈ సీజన్ ఆరంభం కావడానికి ఇంకా ఆరు నెలల సమయం ఉండగానే దిద్దుబాటు చర్యలకు దిగారు. కొన్ని సీజన్లుగా టీం చేత్త ప్రదర్శన సాగిస్తూ వస్తున్న నేపథ్యంలో కఠిన నిర్ణయాలను తీసుకుంటున్నారు.

విజయాలను సాధించడమే లక్ష్యంగా కీలక మార్పులకు శ్రీకారం చుట్టారు. హెడ్ కోచ్ తాము మూడికి గుడ్ బై చెప్పింది సన్ రైజర్స్ హైదరాబాద్ మేనేజ్మెంట్. ఆయన కాంట్రాక్టు ను పొడిగించకూడదని కావ్య మారన్ నిర్ణయించారు. ఇక ఆయన తమ జట్టుతో కొనసాగబోరని తేల్చి చెప్పారు.

పరస్పర అంగీకారంతోనే ఈ నిర్ణయం తీసుకున్నట్లు సన్ రైజర్స్ మేనేజ్మెంట్ స్పష్టం చేసింది. కాంట్రాక్టు పొడిగించ వద్దంటూ టామ్ మూడి సైతం సంకేతాలను పంపించారని, అందుకే ఆయనకు వీడ్కోలు పలకనున్నట్లు తెలిపింది. రెండు దఫాలుగా ఆయన కాంట్రాక్టును పొడిగించింది. మూడోసారి ఆ నిర్ణయం తీసుకోవట్లేదు. తాము మూడి స్థానంలో వెస్టిండీస్ కు చెందిన లెజెండరీ బ్యాటర్ బ్రియాన్ లారాకు అవకాశం ఇవ్వాలని ప్రాథమికంగా నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.

Read more RELATED
Recommended to you

Exit mobile version