సెంచరీ, హ్యాట్రిక్, 10 వికెట్లు.. ఇంగ్లండ్ ఆల్ రౌండర్ అరుదైన రికార్డు

-

సాధారణంగా క్రికెట్ లో రికార్డులు నమోదు అవుతుండటం మనం చూస్తుంటాం. వాటిలో ముఖ్యంగా బ్యాట్స్ మెన్, బౌలర్ ఇలా పలు రికార్డులను నమోదు చేస్తుంటారు. కానీ ఇంగ్లండ్ ఆల్ రౌండర్ గుస్ అట్కిన్సన్ అరుదైన రికార్డును సృస్టించారు. టెస్ట్ ల్లో అత్యంత వేగంగా ఓ సెంచరీ నమోదు చేయడంతో పాటు.. ఒకే మ్యాచ్ లో 10 వికెట్లు పడగొట్టిన ఆటగాడిగా నిలిచారు. న్యూజిలాండ్ తో జరుగుతున్న రెండో టెస్ట్ లో హ్యాట్రిక్ వికెట్లను కూడా తీశాడు. 

England

దీంతో ఈయనకు అరుదైన ఘనత సాధించాడు. కేవలం 10 టెస్ట్ మ్యాచ్ ల్లోనే అతను ఈ ఫీట్ నమోదు చేశారు. గతంలో భారత ఆల్ రౌండర్ ఇర్పాన్ పఠాన్ 26 టెస్ట్ ల్లో ఈ రికార్డును సాధించారు. కానీ ఇంగ్లండ్ ఆల్ రౌండర్ కేవలం 10 టెస్ట్ ల్లోనే రికార్డు నమోదు చేయడం ఓ రికార్డే అని పలువురు క్రీడాభిమానులు పేర్కొంటున్నారు. మరోవైపు ఇంగ్లండ్ జట్టు కూడా 147 ఏళ్ల క్రికెట్ చరిత్రలో అరుదైన రికార్డును సొంతం చేసుకుంది. 1082 టెస్ట్ లు ఆడిన ఇంగ్లడ్ జట్టు 5లక్షల పరుగుల మైలు రాయిని అందుకోవడం విశేషం.

Read more RELATED
Recommended to you

Exit mobile version