హైదరాబాద్ నగర వాసులకు శుభవార్త.. ట్యాంక్ బండ్ కు స్టార్ హీరోయిన్లు

-

హైదరాబాద్ నగర వాసులకు శుభవార్త అనే చెప్పాలి. ప్రజా విజయోత్సవాల్లో భాగంగా హైదరాబాద్ ట్యాంక్ బండ్ వద్ద ఏర్పాటు చేసిన పలు స్టాళ్లను ఆదివారం రాత్రి సినీ తారలు సందర్శించి సందడి చేయనున్నారు. లక్కీ భాస్కర్ సినిమాతో పాటు పలు హిట్ సినిమాలలో నటించిన మీనాక్షి చౌదరి, సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు తదితర సినిమాల్లో నటించిన అంజలితో పాటు మరికొందరూ సినీ నటులు ఇవాళ సాయంత్రం 6 గంటలకు హెచ్ఎండీఏ గ్రౌండ్ సమీపంలో ఏర్పాటు చేసిన హ్యాండి క్రాప్ట్స్, ఫుడ్ స్టాళ్లను సందర్శిస్తారు.

Tank Bund

హెచ్ఎండీఏ  ఐమాక్స్ గ్రౌండ్స్ లో ఏర్పాటు చేసిన రాహుల్ సిప్లిగంజ్ మ్యూజికల్ కాన్సర్ట్స్ కు హాజరవుతారు. ముఖ్యంగా ప్రముఖ గాయకుడు, లిరిస్ట్, మ్యూజిక్ డైరెక్టర్  రాహుల్ సిప్లిగంజ్ మ్యూజిక్ బృందం చే అద్భుతమైన మ్యూజికల్ కాన్సర్ట్ నిర్వహించనున్నారు. ప్రజా విజయోత్సవాల ముగింపు ఉత్సవాల్లో భాగంగా నిన్న ఏర్పాటు చేసిన వందేమాతరం శ్రీనివాస్ మ్యూజికల్ నైట్ కు అద్భుతమైన ఆదరణ లభించింది. 

Read more RELATED
Recommended to you

Exit mobile version