హిందీ భాషపై సీఎం చంద్రబాబు సంచలన వ్యాఖ్యలు చేశారు. మనం హిందీ ఎందుకు నేర్చుకోవాలని అడుగుతున్నారని పేర్కొన్నారు. కానీ పీవీ నరసింహ రావు 17 భాషలు నేర్చుకున్నాడు.. అందుకే అంత గొప్ప వ్యక్తిగా ఎదిగాడు అని గుర్తు చేశారు ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు. మాజీ ప్రధాని పీవీ నరసింహారావు తీసుకున్న చర్యలతోనే ఐటీ విప్లవం వచ్చిందని సీఎం చంద్రబాబు చెప్పారు.

ఢిల్లీలో జరిగిన ఓ కార్యక్రమంలో మాట్లాడుతూ.. ‘1990ల్లో దేశ ఆర్థిక వ్యవస్థ తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంది. సరైన విధానాలు లేక ఆర్థిక వ్యవస్థ అస్తవ్యస్తంగా ఉండేది. పీవీ ప్రధాని అయ్యాక దేశ ఆర్థిక సంస్కరణలు కొత్తరూపు సంతరించుకుని గేమ్ ఛేంజర్‌గా మారాయి. దేశంలో పారిశ్రామిక పురోగతికి బాటలు వేశాయి’ అని అన్నారు.