ఇండియా వేదికగా ఈ సంవత్సరం వన్ డే వరల్డ్ కప్ 2023 జరగనుంది. ఇప్పటికే షెడ్యూల్ ను సైతం ఐసీసీ ప్రకటించిన విషయం తెలిసిందే. కానీ తాజాగా బోర్డు అఫ్ క్రికెట్ కంట్రోల్ అఫ్ ఇండియా ఒక కీలకమైన వార్తను కాసేపటి క్రితమే తెలియచేసింది. మ్యాచ్ లు ప్రకటించిన షెడ్యూల్ ప్రకారం జరగడం లేదని బాంబు పేల్చారు. కొన్ని మ్యాచ్ లు తేదీలలో మార్పులు ఉంటాయని బీసీసీఐ సెక్రెటరీ జై షా ప్రకటించారు. కాగా పూర్తి తేదీలతో కూడిన కొత్త షెడ్యూల్ ను రెండు మూడు రోజుల్లో అధికారికంగా ప్రకటిస్తామని చెప్పారు. ఈ షెడ్యూల్ విడుదల అయ్యాక టికెట్స్ ను కొనుగోలు చేయడానికి అవకాశాలు కల్పిస్తామని జై షా చెప్పారు. అంతే కాకుండా ఇండియా తరపున వరల్డ్ కప్ లో బరిలోకి దిగడానికి సూపర్ బౌలర్ జస్ప్రీత్ బుమ్రా పూర్తిగా ఫిట్ గా ఉన్నాడని అభిమానులకు శుభవార్తను అందించారు.
వరల్డ్ కప్ 2023 షెడ్యూల్ లో కీలక మార్పులు… : బీసీసీఐ
-