శ్రీలంక క్రికెట్ జట్టు వచ్చె నెలలో ఇండియా రానుంది. ఫిబ్రవరి 25 నుంచి రెండు టెస్టులతో పాటు మూడు టీ 20 మ్యాచ్ లను టీమిండియాతో శ్రీలంక ఆడనుంది. ప్రస్తుతం ఉన్న షెడ్యూల్ ప్రకారం ముందు టెస్టు సిరీస్ తర్వాత టీ 20 సిరీస్ ను ఈ రెండు జట్లు ఆడనున్నాయి. అయితే ఈ షెడ్యూల్ కాస్త మార్పులు చోటు చేసుకునే అవకాశం ఉన్నట్టు తెలుస్తుంది. ప్రస్తుతం ఉన్న షెడ్యూల్ లో పలు మార్పలు చేయాలని బీసీసీఐని శ్రీలంక క్రికెట్ బోర్డు కోరినట్టు సమాచారం. దీనికి బీసీసీఐ కూడా సానుకూలంగా స్పందించినట్టు తెలుస్తుంది.
ప్రస్తుతం ఉన్న షెడ్యూల్ ప్రకారం ముందుగా టెస్టు సిరీస్ ఆడన్నాయి. అయితే ముందు టెస్టు సిరీస్ కాకుండా టీ 20 నిర్వహించాలని బీసీసీఐని శ్రీలంక బోర్డు విజ్ఞాప్తి చేసినట్టు సమాచారం. అయితే భారత్ కు వచ్చే ముందు ఫిబ్రవరి 5 నుంచి 20 వరకు శ్రీలంక జట్టు ఆస్ట్రేలియాలో పర్యటించ నుంది. ఆస్ట్రేలియాలో పర్యటించిన జట్టునే భారత్ బయో బబుల్ లో ఉంచాలని శ్రీలంక బోర్డు భావిస్తుంది. అందు కోసం ముందుగా టీ 20 సిరీస్ ను నిర్వహించాలని బీసీపీఐని కోరింది.
కాగ ప్రస్తుతం ఉన్న షెడ్యూల్ ప్రకారం తొలి టెస్టు ఫిబ్రవరి 25 నుంచి మార్చి 1 వరకు బెంగళూర్ లో, రెండో టెస్టు మార్చి 5 నుంచి 9 మొహాలీలో ఆడనున్నాయి. అలాగే మార్చి 13న మొహాలీలో తొలి టీ 20, మార్చి 15న ధర్మశాల రెండో టీ 20, మార్చి 18న లక్నో లో మూడో టీ 20 ఆడనున్నాయి. అయితే శ్రీలంక బోర్డు కోరిక తో పాటు కరోనా వ్యాప్తి వల్ల షెడ్యూల్ డెట్స్, వేదికలు కూడా మారనున్నాయని తెలుస్తుంది.