BREAKING : వన్డే క్రికెట్‌కు డేవిడ్‌ వార్నర్‌ గుడ్‌బై

-

ఆస్ట్రేలియా స్టార్ క్రికెటర్‌ డేవిడ్‌ వార్నర్‌ న్యూ ఇయర్ వేళ కీలక నిర్ణయం తీసుకున్నాడు. వన్డే క్రికెట్‌కు గుడ్ బై చెప్పాడు ఈ స్టార్ ప్లేయర్. భారత్‌పై వన్డే ప్రపంచకప్‌ గెలిచిన ఈ తరుణమే ఆటకు ముగింపు పలకడానికి సరైన సమయంగా భావిస్తున్నట్లు చెబుతూ తన రిటైర్మెంట్‌ ప్రకటించాడు. తన నిర్ణయం వల్ల కొత్త వారికి అవకాశాలు లభిస్తాయని ఆశాభావం వ్యక్తం చేస్తున్నట్లు చెప్పాడు. తన క్రికెట్‌ కెరీర్‌ను తీర్చిదిద్దడంలో ఆస్ట్రేలియా మాజీ కెప్టెన్‌ గ్రెగ్‌ చాపెల్‌ కీలక పాత్ర పోషించినట్లు వార్నర్ తెలిపాడు.

వార్నర్‌ ఇప్పటికే టెస్ట్‌ క్రికెట్‌కు రిటైర్మెంట్‌ ప్రకటించాడు. ఈవారం పాకిస్థాన్‌తో జరగనున్న ఫైనల్‌ టెస్ట్‌ మ్యాచ్‌ అతని కెరీర్‌లో చివరి మ్యాచ్గా నిలవనుంది. “అయితే, 2025లో జరిగే ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీలో ఆస్ట్రేలియాకు ఓపెనర్ అవసరమైతే మాత్రం నేను పునరాగమనం చేస్తాను. మరోవైపు ఆస్ట్రేలియాలో జరిగే బిగ్‌బాష్‌ లీగ్‌లో కొనసాగుతానుడు. టెస్టు, వన్డే క్రికెట్‌ నుంచి తప్పుకోవడం వల్ల ఫ్రాంఛైజీ లీగ్‌లలో ఆడేందుకు ఎక్కువ సమయం లభిస్తుంది.” అని వార్నర్ చెప్పుకొచ్చాడు.

Read more RELATED
Recommended to you

Exit mobile version