సెలబ్రిటీలు కనిపిస్తే వారి వద్ద ఆటోగ్రాఫ్.. వీలైతే సెల్ఫీ తీసుకోవడం ఈరోజుల్లో కామన్. కానీ కొంతమంది అభిమానులు మాత్రం కొన్నిసార్లు మితిమీరి ప్రవర్తిస్తారు. ఇది సెలబ్రిటీల వ్యక్తిగత స్వేచ్ఛకు భంగం కలిగిస్తుంది. గతంలో విరాట్ కోహ్లీ హోటల్ రూమ్ వీడియో వైరల్ అయిన విషయం తెలిసిందే. ఇది అప్పట్లో చాలా చర్చకు తెరలేపింది. ఇక తాజాగా ఓ ఎయిర్ హోస్టస్ పోస్టు చేసిన వీడియో ఇప్పుడు వైరల్ అవుతోంది.
టీం ఇండియా మాజీ ప్లేయర్, చెన్నై సూపర్ కింగ్స్ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ ఇటీవల ఓ విమానంలో ప్రయాణించాడు. ఆ సమయంలో విశ్రాంతి తీసుకుంటుండగా ఎయిర్ హోస్టెస్ ధోనీ వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్టు చేసింది. ప్రస్తుతం ఈ వీడియో వైరల్ అవుతోంది. ధోనీ నిద్రిస్తున్న సమయంలో వీడియోను రికార్డ్ చేయడంతో ఎయిర్ హోస్టెస్ పై ఫ్యాన్స్ మండిపడుతున్నారు. ‘ధోనీ గోప్యతను గౌరవించండి’ అంటూ కామెంట్స్ చేస్తున్నారు.
Cutest video of the day ❤️🫶#MSDhoni pic.twitter.com/7uSSJepSgM
— Chakri Dhoni (@ChakriDhoni17) July 29, 2023