అత‌డి మాట‌లు బాధించ‌లేదు : సాహా వ్యాఖ్య‌ల‌పై ద్ర‌విడ్

-

టీమిండియా ఆట‌గాడు.. వృద్ధిమాన్ సాహా ఆదివారం హెడ్ కోచ్ రాహుల్ ద్రవిడ్ చేసిన వ్యాఖ్య‌లు తీవ్ర దూమారాన్ని లేపిన విషయం తెలిసిందే. తాజా గా సాహా వ్యాఖ్య‌ల‌పై టీమిండియా హెడ్ కోచ్.. రాహుల్ ద్ర‌విడ్ స్పందించాడు. సాహా త‌నపై చేసిన ఆరోప‌ణ‌లు త‌న‌ను బాధించ‌లేద‌ని అన్నారు. టీమిండియా ఎన్నో విజ‌యాల‌కు కార‌ణం అయిన సాహా పై త‌నకు గౌర‌వం కూడా ఉంద‌ని అన్నారు. జ‌ట్టు ఎంపికలో తాను, కెప్టెన్ రోహిత్ శ‌ర్మ క‌ఠినంగా ఉంటామ‌ని అన్నారు. ఆట‌గాళ్ల‌ను తుది జ‌ట్టుకు ఎందుకు ఎంపిక చేయ‌డం లేదో.. కార‌ణాన్ని వారి ముందే చెబుతామ‌ని అన్నారు.

అది కొంత వ‌ర‌కు వాళ్ల‌కు బాధ క‌లిగించినా.. నిజం చెబుతామ‌ని అన్నారు. అలా చెప్ప‌డం వ‌ల్ల.. త‌మ లోపాల‌ను సరి దిద్దుకునే అవ‌కాశం ఉంటుంద‌ని వివ‌రించారు. అందుకే కాస్త క‌ఠినంగా మాట్లాడాల్సి వ‌స్తుంద‌ని అన్నారు. అయితే ఈ వ్యాఖ్య‌లను సాహా మీడియా ముందు చెప్పాల్సింది కాద‌ని అభిప్రాయ ప‌డ్డాడు. అంద‌రి అట‌గాళ్లుకు ఎలా చెప్పానో.. త‌న‌కు కూడా అలాగే వివ‌రించాన‌ని అన్నారు. కానీ సాహా.. త‌న వ్యాఖ్య‌ల‌ను స్వీక‌రించ‌లేద‌ని అన్నారు. అలాగే మ‌నం చెప్పిన మాట‌ల‌ను అంద‌రూ స్వీక‌రించాల‌నే రూలేమీ లేదు కదా అని అన్నారు.

కాగ సాహా ఆదివారం మీడియా స‌మావేశంలో.. హెడ్ కోచ్ రాహుల్ ద్రవిడ్.. త‌న‌ను రిటైర్మెంట్ గురించి ఆలోచించాల‌ని స‌ల‌హా ఇచ్చాడ‌ని ఆరోపించారు. త‌ను తుది జ‌ట్టులో ఉంటాన‌ని బీసీసీఐ చీఫ్ గంగూలీ నుంచి స్ప‌ష్టమైన హామీ ఉన్నా.. త‌న‌కు చోటు ఇవ్వ‌లేద‌ని రాహుల్ ద్రవిడ్ పై సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశాడు.

Read more RELATED
Recommended to you

Exit mobile version